జపాన్ దేశంలోని ఒసాకా నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇందులో 27 మంది సజీవదహనమయ్యారు. ఈ నగరంలో అత్యంత రద్దీగా ఉండే షాపింగ్ కాంప్లెక్స్ భవనంలో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్నపోలీసులు, అగ్నిమాపకదళ బృందం సభ్యులు ఆగమేఘాలపై అక్కడకు చేరుకుని కేవలం 30 నిమిషాల్లోనే మంటలను ఆర్పివేశారు.
మొత్తం 8 అంతస్తుల భవనంలో నాలుగో అంతస్తు పూర్తిగా కాలిపోయింది. భవనం మొత్తం పొగ కమ్ముకుని నల్లగా మారిపోయాయి. ఉదయం 0.18 నిమిషాలకు ఈ ప్రమాదం సంభవించింది. ఈ మంటలను ఆర్పివేసేందుకు దాదాపు 70 ఫైరింజన్లను ఉపయోగించారు.