Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆడపిల్లలంటే ఆట వస్తువులు కాదు... వైసీపీ నాయకులకు నారా భువనేశ్వరి కౌంటర్

Advertiesment
nara bhuvanewsari
విజ‌య‌వాడ‌ , సోమవారం, 20 డిశెంబరు 2021 (18:04 IST)
నా ధర్మ ప‌త్నిని కూడా అవ‌మానించారు... ఇది అసెంబ్లీనా, కౌర‌వ స‌భ‌నా అంటూ వెక్కి వెక్కి ఏడ్చిన టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఉదంతం ఇప్ప‌టికీ ఆంధ్ర రాష్ట్ర ప్ర‌జ‌ల క‌ళ్ళ ముందు క‌దలాడుతుంది. ఆ రోజు జ‌రిగిన సంఘ‌ట‌న‌పై నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజకీయ ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.


అయితే, తాజాగా ఇపుడు నారా భువ‌నేశ్వరి రంగంలోకి దిగారు. త‌న తండ్రి పేరిట నెల‌కొల్పిన ఎన్టీయార్ ట్ర‌స్ట్ త‌ర‌ఫున తిరుప‌తిలో వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయం చేసిన కార్య‌క్ర‌మంలో ఆమె పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ, త‌న మ‌నోభావాల‌ను భువ‌నేశ్వ‌రి వెల్ల‌డించారు. 

 
ఆడ పిల్లలంటే ఆట వస్తువులు కాదు. పనిలేక మాపై విమర్శలు చేస్తున్నారు. సమాజానికి ఉపయోగం లేని విమర్శలెందుకు? అతి పెద్ద రాష్ట్రాన్ని నా భర్త ఏ విధంగా అభివృద్ధి చేశారో నాకు తెలుసు. రాత్రింబవళ్లు నిద్ర లేకుండా పని చేసిన వ్యక్తి చంద్రబాబు - రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉండాలి. నా భర్త పనితీరు ఏంటో ప్రజలకు తెలుసు. వైసీపీ నేతల విమర్శలను పట్టించుకోం.. మేము ప్రజాసేవకే అంకితమవుతాం. అని నారా భువనేశ్వరి కౌంట‌ర్ ఇచ్చారు. త‌న‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు ప‌శ్చాత్తాపంతో క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీపై కూడా భువ‌నేశ్వ‌రి త‌న‌దైన శైలిలో స్పందించారు. వాళ్ళు చెప్పిన సారీల‌ను తాము స్వీక‌రించ‌డం లేద‌న్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సరదాగా ఈతకెళ్ళారు, ఒకరు ఒడ్డుకు చేరారు, మిగిలిన ముగ్గురు..?