ఆదివారం సరదాగా ఈత కొడతామనుకున్నారు. దగ్గరలో ఉన్న చెరువు వద్దకు వెళ్ళారు. నలుగురికి ఈత తెలుసు. అందరూ కలిసి నీళ్ళలో దిగారు. కానీ లోతు ఎక్కువగా ఉంది. బురద మట్టి ఎక్కువగా ఉంది. దీంతో ముగ్గురు లోపల ఇరుక్కుపోయారు. ఒక్కడే సురక్షితంగా బయట పడ్డాడు. 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	
	 
	చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం జివి పాలెం గ్రామంకు చెందిన ధోనీ, యుగంధర్, గణేష్, లిఖిత్ సాయిలు నలుగురు కలిసి స్థానికంగా ఉన్న స్వర్ణముఖి వాగులోకి వెళ్ళారు. వీళ్లందరూ స్థానికంగా ఉన్న దళితవాడలో నివాసముంటున్నారు. 
 
									
										
								
																	
	
	 
	అయితే సరదాగా కాసేపు ఈత కొట్టారు. కానీ ఇంకా లోతుగా వెళదామనుకుని ముగ్గురు పోటీలు పడి లోపలికి వెళ్ళారు. లిఖిత్ సాయి మాత్రం వెళ్ళలేదు. దీంతో లిఖిత్ సాయి మాత్రం ఒడ్డుకు వచ్చేశాడు.
 
									
											
							                     
							
							
			        							
								
																	
	
	 
	మిగిలిన ముగ్గురు లోపలే చిక్కుకుపోయారు. వారి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. గజ ఈతగాళ్లు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులు నీటమునగడంతో గ్రామం మొత్తం విషాదంలోకి వెళ్ళిపోయింది.