Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్లైన్ క్లాస్ గ్రూప్‌లో నీలి చిత్రాలు - షాకైన విద్యార్ధినీవిద్యార్ధులు

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (23:15 IST)
కర్నూలు జిల్లా పత్తికొండలో రెచ్చిపోతున్న ఆకతాయిలు. అడ్డు అదుపు లేకుండా పోతుందన్న విద్యార్థినిల తల్లిదండ్రులు. ఇంతకీ మేటర్ ఏంటంటే... కరోనా పుణ్యమా అంటూ స్కూళ్లు మూతపడ్డాయి. ఆన్ లైన్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. అయితే... ఈ ఆన్లైన్ క్లాసులు వలన ఎంత నేర్చుకుంటున్నారు అనేది పక్కన పెడితే... ఆన్లైన్ క్లాసుల కోసం ఏర్పాటు చేసిన గ్రూపులో నీలిచిత్రాల వీడియో పోస్టులు విద్యార్థులలో కలకలం రేపుతున్నాయి.
 
ఈ విషయం విద్యార్థుల నుంచి అలాఅలా.. బయటకొచ్చింది. దీంతో.. గ్రూపులో నీలి చిత్రాల వీడియోలు పోస్ట్ చేసిన వ్యక్తులపై చర్య తీసుకోవాలని AISF విద్యార్థి సంఘం నాయకులు ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా చేసారు.
 
వివరాల్లోకి వెళితే... పత్తికొండ ప్రభుత్వ బాలికల హైస్కూల్లో 8వ తరగతి విద్యార్థుల ఆన్లైన్ క్లాసులకు సంబంధించి టీజర్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసారు.
 
వాట్సాప్ గ్రూప్‌లో నీలి చిత్రం వీడియో పోస్ట్ విద్యార్థులలో కలకలం రేపింది. ఇలా ఇప్పటికే రెండుమూడు సార్లు జరిగింది. ఈ నీలిచిత్రాల వీడియోలు పోస్టులు బాలికల విద్యార్థుల వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేయడంపై AISF విద్యార్థి సంఘం నాయకులు పత్తికొండలో ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
 
నీలి చిత్రాలను పోస్ట్ చేసిన వ్యక్తిపై చర్య తీసుకోవాలని, గ్రూప్ అడ్మిన్లుగా ఉన్న టీచర్లు ఇలాంటి పోస్టులపై స్పందించకపోవడం వలన టీచర్లపై కూడా చర్య తీసుకోవాలని ఎంఈఓకు విద్యార్ధి సంఘం నాయకులు ఫిర్యాదు చేసారు. పిల్లలు ఆన్లైన్ క్లాసులు తల్లిదండ్రుల ఫోన్ నుంచే వింటున్నారు. ఏ విద్యార్థి తల్లిదండ్రుల ఫోన్ నుంచైనా ఈ నీలిచిత్రాల వీడియోలు వచ్చాయా...? లేక ఎవరైనా కావాలనే నీలి చిత్రాలను ఈ గ్రూపులో పోస్ట్ చేసారా అనేది తెలియాల్సివుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం