Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లవ్ పేరుతో వంచించి విద్యార్థిని నగ్న వీడియో, ఆపై 'మై నేమ్ ఈజ్ 420', ఏమైంది?

Advertiesment
లవ్ పేరుతో వంచించి విద్యార్థిని నగ్న వీడియో, ఆపై 'మై నేమ్ ఈజ్ 420', ఏమైంది?
, మంగళవారం, 7 జులై 2020 (12:09 IST)
ఈమధ్య కాలంలో ప్రేమ పేరుతో కొందరు యువకులు అమ్మాయిలను వంచించి వేధిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఏపీలో ఓ ఇంజనీరింగ్‌ కాలేజీకి చెందిన వరుణ్‌ అనే విద్యార్థి ప్రేమ పేరుతో తన సహ విద్యార్థినిని వంచించి ఆమె నగ్న వీడియో చిత్రీకరించాడు. ఆ తర్వాత తనలోను మరో కోణాన్ని బయటపెట్టాడు.
 
ఆ వీడియోతో ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేయడమే కాకుండా తను తీసిన వీడియోను తోటి విద్యార్థులకు ఫార్వార్డ్‌ చేసి వారిని రెచ్చగొట్టాడు. అలా బాధితురాలి నగ్న చిత్రాలు మరో ఆరుగురికి చేరాయి. నగ్న చిత్రాలతో మణికంఠ, ధనుంజయరెడ్డి అనే ఇద్దరు విద్యార్థులు బాధితురాలికి పంపి ఆమెను తమకు లొంగిపోవాలని వేధించారు. మిగిలినవారు కూడా ఇలాగే వేధిస్తూ వచ్చారు.
 
మరోవైపు మణికంఠ అనే విద్యార్థి ‘మై నేమ్ ఈజ్ 420’ అనే పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచి అందులో నుండి బాధితురాలికి నగ్న చిత్రాలను పంపి రూ. 50 వేలు నగదు పంపాలంటూ డిమాండ్ చేశాడు. దీనితో ఆమె బ్యాంకు ఖాతా వివరాలు పంపాలనడంతో దొరికిపోతామని సైలెంట్ అయ్యాడు.
 
వీరి వేధింపులను బాధిత యువతి పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్లడంతో తమదైన శైలిలో వారు దర్యాప్తు చేపట్టారు. మొత్తం ఏడుగురు నిందితులను పక్కా ఆధారాలతో అరెస్ట్‌ చేసి వారి నుంచి ల్యాప్‌టాప్, 14 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని కటకటాల వెనక్కి నెట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టిక్‌టాక్‌కు మరో షాక్.. హాంకాంగ్ మార్కెట్ నుంచి అవుట్