Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో వాలంటీర్ల ఓవరాక్షన్.. మైనర్ బాలికపై గ్రామ వాలంటీర్ అఘాయిత్యం

Advertiesment
minor girl
ఏపీలో వాలంటీర్లు ఓవరాక్షన్ చేస్తున్నారు. కొందరు ప్రభుత్వం ఇస్తున్న జీతాలు చాలక చోరీలకు పాల్పడుతున్నారు. ప్రజల కోసం నియమించబడిన గ్రామ వాలంటీర్లు అకృత్యాలకు పాల్పడుతున్నారు. తమ వద్దకు వచ్చిన ప్రజల అవసరాలను సాకుగా వారిపై వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఓ వాలంటీర్ ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తిరుపతిలోని పుంగనూరు మండలం గూడూరుపల్లెలో చోటు చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. తిరుపతిలోని పుంగనూరు మండలం గూడూరుపల్లెకు చెందిన గ్రామ వాలంటీర్ నరేశ్ అదే ఊరికి చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అదే గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని స్నానం చేసి ఇంటిలోకి వెళ్తుండగా అటకాయించిన వాలంటీర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
అయితే సంఘటన జరిగిన రెండు రోజులు తర్వాత బాధితురాలి తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదుకు 2రోజుల ముందే నరేష్‌పై కేసు కానివ్వకుండా కాపాడే ప్రయత్నం చేశారు.. ఆ గ్రామం వైసీపీ నాయకులు. పంచాయితీ పెట్టి విషయాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనావైరస్ నిర్థారణ కోసం ఐ మాస్క్ బస్సులు, విజయవాడలో ప్రారంభం