Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు సభలకు నామమాత్రపు బందోబస్తుతో మమ అనిపిస్తున్న పోలీసులు

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2022 (11:47 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీముఖ్యమంత్రి, జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన చంద్రబాబు నాయుడు నిర్వహించే రోడ్‌షోలకు, బహిరంగ సభలకు ఏపీ పోలీసులు భద్రత కల్పించేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. కేవలం నామమాత్రపు బందోబస్తుతో మమ అనిపిస్తున్నారు. ఈ కారణంగా బుధవారం రాత్రి నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన రోడ్‍షోలో తొక్కిసలాట జరిగి ఎనిమిది చనిపోయారు. దీనికి కారణం సరైన పోలీస్ భద్రత లేకపోవడమేననే విమర్శలు వస్తున్నాయి. ఇది స్థానికంగానే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 
 
కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ప్రభుత్వేతర కార్యక్రమాలకు వస్తే మాత్రం వేలాది మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. అదే చంద్రబాబు పర్యటనలకు మాత్రం పోలీసులు ఏమాత్రం శ్రద్ధ చూపించడంలేదు. నామమాత్రపు భద్రతతో మమ అనిపించేస్తున్నారు. 
 
ఈ నెల 20వ తేదీన ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కుమారుడి వివాహ విందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హాజరయ్యారు. ఆ రోజు 1100 మంది పోలీసులతో భద్రత కల్పించారు. ఈ నెల 26వ తేదీ మంత్రి ఆదిమూలపు సురేష్ తల్లి మృతి చెందారు. 
 
ఆ తర్వాత రోజు అంటే ఒక్క రోజు వ్యవధిలో జగన్ జిల్లాకు వచ్చారు. కేవలం ఒక్క రోజులోనే వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు కల్పించారు. చంద్రబాబు పర్యటనలో మాత్రం వేళ్ళమీద లెక్కించే స్థాయిలో పోలీసులతో భద్రత కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments