Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జీతాలు ఇవ్వలేని ఈ దద్దమ్మ జగన్ మూడు రాజధానులు నిర్మిస్తాడా? : చంద్రబాబు

bobbili babu
, శనివారం, 24 డిశెంబరు 2022 (09:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే ఒక్క రాజధాని ఉండాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోమారు పునరుద్ఘాటించారు. ఆయన ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మరోమారు నవ్యాంధ్రకు ఒకే ఒక్క రాజధాని ఉండాలంటూ తేల్చి చెప్పారు. విశాఖపట్టణంను ఆర్థిక, పర్యాటక కేంద్రా మారాలని ఆయన అభిలషించారు. 
 
విజయనగరం జిల్లా బొబ్బిలిలో చంద్రబాబు శుక్రవారం రాత్రి రోడ్‌షో నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని అభిప్రాయపడ్డారు. అమరావతిలో రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిందన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు వెయ్యి రోజులుగా ఆందోళన చేస్తున్నారని గుర్తు చేశారు.
 
ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని ఈ దద్దమ్మ జగన్ మూడు రాజధానులు నిర్మిస్తారా అంటూ ప్రశ్నించారు. జగన్‌వి అన్నీ సన్నాసి మాటలన్నారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ పేరతో యువతని మోసంగించారని మండిపడ్డారు. 
 
జగన్ రెడ్డి పాలనలో ఏ ఒక్కరూ ఆనందంగా లేరని వ్యాఖ్యానించారు. రైతులకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదన్నారు. రాష్ట్రంలో రైతులు పూర్తిగా చితికిపోయారన్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అట్టడుగు స్థాయికి జగన్ రెడ్డి దిగజార్చాడన్నారు.
 
తాము గతంలో ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచామని, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. నాయకత్వం కోసం మహిళలు పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ సీఎం సెన్సేషనల్ కామెంట్స్.. ఒకే భార్య.. ఒకటే రాష్ట్రం