Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు సభలో తొక్కిసలాట - 8కి చేరిన మృతుల సంఖ్య

chandrababu
, గురువారం, 29 డిశెంబరు 2022 (09:56 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగింది. ఇందులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ పర్యటనలో భాగంగా, ఆయన బుధవారం రాత్రి కందుకూరులో రోడ్‌షోతో పాటు బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు జనం పోటెత్తారు. కందుకూరు ఆస్పత్రి నాలుగు రోడ్ల కూడలి కిక్కిరిసి పోయింది. ఆ సమయంలోనే అపశృతి చోటుచేసుకుంది. 
 
జనం భారీగా తరలిరావడంతో తొక్కిసలాట సంభవించింది. ఈ ఘటనలో అక్కడే ఇద్దరు చనిపోగా మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అలాగే, మరికొందరు గాయపడ్డారు. చనిపోయిన వారిలో మర్లపాటి చినకొండయ్య, కాకుమాని రాజా, పురషోత్తం, కలవకూరి యానాది, దేవినేని రవీంద్రబాబు, యాటగిరి విజయ అనే వారు ఉన్నారు. మరో వ్యక్తి వివరాలు తెలియాల్సివుంది. 
 
ఈ ఘటనపై చంద్రబాబు స్పందిస్తూ, కొందరు నిండు ప్రాణాలు త్యాగం చేశారని చెబుతూ సభను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని, కొన్ని సందర్భాల్లో మనం నిమిత్తమాత్రులం అవుతామని, విధఇరాత ఇలా ఉందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. అలాగే, గాయపడిన వారిని కూడా ఆదుకుంటామని వెల్లడించారు. 
 
తన 40 యేళ్ళ రాజకీయ జీవితంలో ఇలాంటి దుర్ఘటన జరగలేదన్నారు. ఎపుడు కందుకూరు వచ్చినా ఆస్పత్రి సెంటర్‌లోనే సభ పెడుతుంటామని, కానీ ఈసారి దురదృష్టకర ఘటన జరిగిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సభను కొనసాగించడం భావ్యం కాదని, దీన్ని సంతాప సభగా భావించి మృతుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటిద్దామని తెలిపి, అదే విధంగా చేశారు. ఆ తర్వాత సభను అర్థాంతరంగా ముగించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'పరీక్ష బాగా రాసి రా' అని చెప్పిన తల్లి.. ఉసురు తీసుకున్న విద్యార్థిని!