Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కందుకూరు తొక్కిసలాట మృతులకు ప్రధాని ఆర్థిక సాయం

narendra modi
, గురువారం, 29 డిశెంబరు 2022 (11:26 IST)
నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం నిర్వహించిన రోడ్‍‌షోలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది చనిపోయారు. ఈ మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థికసాయం ప్రకటించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఒక్కో మృతుని కుటుంబానికి రూ.2 లక్షస చొప్పున ఎక్స్‌గ్రేషియా అందచేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. 
 
అలాగే, ఈ దుర్ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నిధి నుంచి ఒక్కో మృతుని కుటుంబానికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలుచొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్టు ప్రధాని ప్రకటించారు. 
 
కాగా, బుధవారం చంద్రబాబు నాయుడు పాల్గొన్న ఇదేం ఖర్మ రాష్ట్రానికి రోడ్‌షో సభకు, టీడీపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట సంభవించడంతో ఎనిమిది మంది చనిపోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. 
 
కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీగా తరలిరావడంతో తోపులాట జరిగి ఒకరిపై ఒకరు పడటంతో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన వారి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా, టీడీపీ తరపున మృతులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్టు చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మ - నానమ్మ గుణాలు ఉంటే ఓకే... జీవిత భాగస్వామిపై రాహుల్