Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌తో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు ప్రతినిధుల భేటీ

Webdunia
గురువారం, 5 సెప్టెంబరు 2019 (16:08 IST)
ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకు ‘న్యూ డెవలప్‌‌మెంట్‌ బ్యాంకు’ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌తో గురువారం భేటీ అయ్యారు. బ్యాంకు వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.జాంగ్, ప్రాజెక్టు హెడ్‌ రాజ్‌పుర్కర్‌ తాడేపల్లి నివాసంలో గురువారం ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. రాష్ట్రానికి 6 వేల కోట్ల రూపాయల రుణం మంజూరు ప్రతిపాదన త్వరలో బ్యాంకు బోర్డు ఆమోదానికి వెళ్తున్న అంశం వీరిమధ్య చర్చకు వచ్చింది. 
 
రోడ్లను మెరుగుపరచడంతోపాటు, వివిధ ప్రాజెక్టులకోసం ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు. రుణంలో 30 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుండగా, 70శాతాన్ని బ్యాంకు మంజూరుచేస్తుంది. 32 సంవత్సరాల్లో ఈ రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్కూళ్లు, ఆస్పత్రులు, పరిశుభ్రమైన తాగునీరు సదుపాయం సహా రోడ్ల నిర్మాణం ప్రాజెక్టులకు మరింత సహాయం అందించాలని ముఖ్యమంత్రి బ్యాంకు ప్రతినిధులకు విజ్ఞప్తిచేశారు. 
 
ఈ ప్రాజెక్టులకు సంబంధించి రూ.25 వేల కోట్ల రూపాయలను మంజూరుచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. బ్రిక్స్‌ దేశాలైన బ్రెజిల్, రష్యా, భారత్,  చైనా, సౌతాఫ్రికా ఈ బ్యాంకును 2015లో ఏర్పాటు చేశాయి. షాంఘై వేదికగా పనిచేస్తున్న ఈ బ్యాంకు ఇప్పటివరకూ వివిధ ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్ల రూపాయలను రుణాలుగా మంజూరుచేసింది. ఒక్క భారత్‌లోనే రూ.25 వేల కోట్లు మంజూరు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments