అప్పుడు జగన్ ముద్దులు, ఇప్పుడు లాఠీ దెబ్బలు: సీఎం జగన్‌లా నారా లోకేష్ యాక్టింగ్..

బుధవారం, 4 సెప్టెంబరు 2019 (15:20 IST)
ఎన్నికలకు ముందు ముద్దులు పెట్టిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు లాఠీ దెబ్బలు కొట్టిస్తున్నారని విమర్శలు గుప్పించారు నారా లోకేష్. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందన్న ఆయన.... ఎన్నికల ముందు 900 హామీలు ఇచ్చి ఇప్పుడు నవరత్నాలు అమలు చేస్తామంటున్నారని విమర్శించారు.
 
ఆంధ్రుల రాజధాని, ప్రజా రాజధాని అమరావతి కళ తప్పిందని... ఎడారిగా మార్చేశారని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చాక వాలంటీర్లకు ఉద్యోగాలు వచ్చాయని... ప్రజల పన్నుల డబ్బును వైకాపా కార్యకర్తలకు ఇస్తున్నారని ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రివర్స్ గేర్లో పయనిస్తోందన్నారు. 
 
విశాఖజిల్లా నర్సీపట్నంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసన ర్యాలీలో పాల్గోన్న లోకేష్... అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు పుట్టినరోజున ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని ప్రభుత్వం అడ్డుకుందని.... అదే పని తాము చేసి వుంటే జగన్ పాదయాత్ర సాగేదా అని ప్రశ్నించారు. సభా వేదికపై జగన్ హావభావాలను అనుకరిస్తూ లోకేష్ చేసిన యాక్షన్‌కు కార్యకర్తలు ఈలలు వేసి గోల చేశారు. అయ్యన్న బర్త్ డే సందర్భంగా కార్యకర్తలకు హెల్మెట్లు పంపిణీ చేశారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఏపీ సీఎం కావాలంటే బీజేపీలో చేరాలి : అన్నం సతీశ్