'సాహో' అద్భుత చిత్రం... చూసేందుకు ఎదురు చూస్తున్నా : నారా లోకేశ్

మంగళవారం, 20 ఆగస్టు 2019 (12:11 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కెంచిన చిత్రం "సాహో". ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. శ్రద్ధాదాస్ హీరోయిన్‌ కాగా, సుజిత్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. 
 
భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం గురించి నారా లోకేశ్ ఓ ట్వీట్ చేశారు. 'సాహో' అద్భుత చిత్రమని, భారీ బడ్జెట్‌తో నిర్మించారని, ఈ చిత్రాన్ని చూసేందుకు తాను ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. 'సాహో' సినిమా చూడాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రభాస్‌ అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు. ప్రభాస్ అభిమానుల్లో తాను ఉన్నానని చెప్పారు. 
 
పైగా, 'సాహో' సినిమాకు వ్యతిరేకంగా తానేదో అన్నట్లుగా ఒక వెబ్‌సైట్‌ ప్రచురించిన కథనంపై లోకేశ్‌ మండిపడ్డారు. 'ఇలాంటి పచ్చి అబద్ధాలు రాసేవారిని ఏమనాలి? కులాల మధ్య చిచ్చుపెట్టి, వైషమ్యాలు పెంచే రాతలు రాస్తే వచ్చిన డబ్బును ఎలా అనుభవించగలుగుతున్నారు? అంతరాత్మ ప్రబోధం ఉండదా?' అంటూ నారా లోకేశ్ ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఫ్రెంచ్ గడ్డం - యంగ్ లుక్‌లో బాలకృష్ణ.. నందమూరి ఫ్యాన్స్ సంబరాలు