Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 1 April 2025
webdunia

ఏపీలో అద్భుతమైన తుగ్లక్ పాలన నడుస్తోంది: నారా లోకేష్ విమర్శలు

Advertiesment
Nara Lokesh
, బుధవారం, 4 సెప్టెంబరు 2019 (21:07 IST)
రాష్ట్రంలో అద్భుతమైన తుగ్లక్ పాలన నడుస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. ఎన్నికలు ముందు ముద్దులు పెట్టిన జగన్.... ఇప్పుడు లాఠీలతో కొట్టిస్తున్నారని విమర్శించారు. 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్రెండ్ మార్చారు. వైసీపీ ప్రభుత్వం పనితీరుపై నిశితమైన విమర్శలతో జనానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 
విశాఖ జిల్లా నర్సీపట్నంలో లోకేష్ టూర్, టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు పుట్టిన రోజు సందర్భంగా నర్సీపట్టణంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమాల్లో లోకేష్ పాల్గొన్నారు. 

నర్సీపట్టణం శ్రీకన్య థియేటర్ దగ్గర నుంచి ఏర్పాటు చేసిన భారీ ప్రభుత్వ వ్యతిరేక బైక్ ర్యాలీలో లోకేష్ పాల్గొన్నారు. హెల్మెట్లు లేకపోతే ర్యాలీకి అనుమతించమని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడం వినూత్న నిరసన చేపట్టారు. 
 
బైక్‌లు తోసుకుంటూ కార్యకర్తలు, అభిమానులు వెంట రాగా ఎన్టీఆర్ ఆసుపత్రి వరకూ వెళ్ళారు. అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన లోకేష్, రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం జరిగిన కార్యకర్తల సభలో లోకేష్.... ముఖ్యమంత్రి హావభావాలను అనుకరిస్తూ ప్రసంగించారు.

ఆంధ్రుల రాజధాని, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు ఐదేళ్లు అహర్నిశలు కష్ట పడ్డారన్న లోకేష్.... జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతి ఇప్పుడు ఎడారిలా మారిందన్నారు.
 
సభ ముగిసిన తర్వాత మూసివేసిన అన్న క్యాంటీన్‌ను పరిశీలించారు. పేదల కోసం టీడీపీ నాయకత్వం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కేంద్రంలో పేదలకు భోజనం వడ్డించారు. ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో పలు ఆసక్తికరమైన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.

జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావడంపై లోకేష్ నేరుగా స్పందించలేదు. తమ సేనాధిపతి చంద్రబాబు నాయకత్వంలో మేమంతా సైనికులమేనన్నారు. పార్టీ అభివృద్ధిని కాక్షించే ఎవరైనా క్రియాశీలకంగా మారవొచ్చని సూచించారు. అలాగే చంద్రబాబు ఇల్లు సహా తెలుగుదేశం పార్టీ కార్యాలయాల నిర్మాణాలు అన్నీ సక్రమంగానే జరిగాయని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇలాగైతే చాలామంది పార్టీ వీడడం ఖాయం.. వి.హనుమంతరావు