Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆడది ఇంట్లో... కారు షెడ్డులో... ప్రసాదంలా ఫర్నీచర్... రోజా సెటైర్లు

Advertiesment
ఆడది ఇంట్లో... కారు షెడ్డులో... ప్రసాదంలా ఫర్నీచర్... రోజా సెటైర్లు
, సోమవారం, 26 ఆగస్టు 2019 (15:21 IST)
గత ప్రభుత్వం మహిళల మాన, ప్రాణాలతో చెలాగాటమాడుకుందని, విద్యార్ధి నుంచి ఎమ్మెల్యే వరకూ అందరినీ వేధించి హింసించారని ఎపిఐఐసి ఛైర్మెన్ రోజా తీవ్రస్ధాయిలో విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ స్పీకర్ కోడెల మహిళల పట్ల వ్యవహరించిన తీరుపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. 
 
ఆడవాళ్ళ తాళిబొట్లు తెగిపడిపోయినా, ఆత్మహత్యలు చేసుకున్నా, కాల్‌మనీ సెక్స్ రాకెట్‌తో హింసించినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. మహిళా సమస్యలపై గళం ఎత్తితే రూల్స్‌కు విరుద్ధంగా తనపై కక్ష సాధింపు చేసారని ఆవేదన వ్యక్తం చేసారు. 
 
నిబంధనకు విరుద్ధంగా నన్ను అన్యాయంగా ఏడాది పాటు సస్పెండ్ చేశారని అన్నారు.
మహిళా కమీషన్ చైర్మెన్‌గా వాసిరెడ్డి పద్మ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న రోజా గత ప్రభుత్వం అడుగడుగునా మహిళలను కించపరుస్తూ, హింసిస్తూ వారి జీవితాలతో ఆడుకుందని విమర్శించారు. 
 
విద్యార్ధుల నుంచి మహిళా అధికారుల వరకూ అందరినీ టిడిపి నేతలు వేధించారని ఆరోపించారు. కాల్ మనీలో ఆడవాళ్లను హింసించిన వారిని చంద్రబాబు వెనకేసుకువచ్చారని అన్నారు. చంద్రబాబు కోడలు మగబిడ్డ కంటే అత్త వద్దంటుందా అని, కోడెల అయితే మరీ దారుణంగా కారు షెడ్డులో వుండాలని, ఆడది ఇంట్లో వుండాలని హేళన చేసారని, మహిళల పట్ల వ్యగ్యంగా, అవమానపరిచే విధంగా మాట్లడ్డాన్ని గుర్తు చేసారు. అసెంబ్లీ దేవాలయం తాను పూజరిని అని చెప్పిన కోడెల ఫర్నిచర్ అంతా ప్రసాదంలా తీసుకెళ్లిపోయారని ఎద్దేవా చేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

151 సీట్లు వచ్చినా ఈ బానిసత్వం ఏంది రాజా?