Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఠాగూర్
ఆదివారం, 19 మే 2024 (16:11 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి మేనమామ, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి నోరు జారారు. అన్నపూర్ణ వంటి రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాడు చేసిందని వ్యాఖ్యానించారు. ఆయన ఆదివారం తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా అన్ని అన్నారు. 
 
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని దేవుడిని వేడుకున్నానని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగాపడాలని కోరుకున్నానని తెలిపారు. రైతులు, కార్మికులు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడిని కోరుకున్నానని అన్నారు. వైసీపీకి 175 సీట్లు వస్తాయని చెప్పారు. 
 
జగన్ పార్టీకి సైలెంట్ ఓటింగ్ ఉందని, జూన్ 4 మధ్యాహ్నం నుంచి ఫలితాలు తెలుస్తాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అంతగా ప్రభావం చూపించకపోవచ్చని అన్నారు. వైసీపీ అధికారంలోకి తప్పకుండా వస్తుందని, అవినాష్‌ రెడ్డి ఎంపీగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కడప ఎంపీగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల, ఇంకెవరూ నిలబడ్డ గెలవలేరని చెప్పారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలు చేసిందని రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు.
 
కాగా, రవీంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆయన వ్యాఖ్యలు పార్టీతో పాటు పార్టీ కార్యకర్తలను కూడా తీవ్ర ఇబ్బందుల్లో పడేసేలా ఉన్నాయని పార్టీ నేతలే చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments