Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ - బలగాల మొహరింపు.. టీడీపీ - వైకాపా నేతల గృహనిర్బంధం!!

Advertiesment
palnadu tense

ఠాగూర్

, బుధవారం, 15 మే 2024 (14:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 13వ తేదీన ముగిసింది. ఈ పోలింగ్ రోజు నుంచి పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. అధికార వైకాపా, విపక్ష టీడీపీ నేతలు పరస్పరం కాలుదువ్వుకుంటూ ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. పోలింగ్ తర్వాత ఈ దాడులు మరింతగా పెరిగిపోయాయి. అధికార వైకాపా నేతలు మరింత రెచ్చిపోయి టీడీపీ నేతల ఇళ్లపై దాడులకు తెగబడ్డారు. కారంచేడులోని టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టారు. టీడీపీ నేతల వాహనాకు నిప్పంటించారు. పరిస్థితులు చేయిదాటిపోవడంతో పల్నాడులో 144 జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. కారంపూడి, కొత్తగణేషునిపాడులో హింసాత్మక ఘటనలు జరిగినందున బలగాలను మోహరించారు. జిల్లాలోని మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాలపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మొత్తం 19 కంపెనీల బలగాలను మోహరించారు. గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మాచర్లలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ కూడా అక్కడే ఉన్నారు. మాచర్లలో అడుగడుగునా పోలీసులు మోహరించారు. పట్టణంలోకి వచ్చేవారి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. 
 
జిల్లాలో వైకాపాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. గురజాలలో కాసు మహేశ్‌ రెడ్డి, నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డితో పాటు ఆయన సోదరుడు వెంకటరామి రెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున ముగ్గురి కంటే ఎక్కువమంది గుమిగూడవద్దని ఎస్పీ బిందుమాధవ్‌ హెచ్చరించారు. సామాన్యుల జీవనానికి ఆటంకాలు కలిగించబోమన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పులివర్తి నానిపై హత్యాయత్నం : పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు!!