Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

పల్నాడులో ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి.. టిప్పర్ ఢీకొనడంతో...

Advertiesment
Eight dead as fire breaks out from a private bus after collision with tipper in Palnadu

సెల్వి

, బుధవారం, 15 మే 2024 (09:41 IST)
Palnadu
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఏరివారిపాలెం సమీపంలో ప్రైవేట్ బస్సును లారీ ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లతో పాటు ఆరుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 
 
ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన బస్సు 40 మంది ప్రయాణికులతో బాపట్ల జిల్లా చినగంజాం నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామాలకు వెళ్లిన ప్రయాణికులు హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
చిలకలూరిపేట మండలం ఏరివారిపాలెం రోడ్డు వద్దకు రాగానే ఎదురుగా కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్‌ బస్సును ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. 
 
ఢీకొనడంతో రెండు వాహనాలకు మంటలు చెలరేగాయి. దీని ఫలితంగా ఇద్దరు డ్రైవర్లు, నలుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. 
 
మృతుల్లో ఉప్పుగుండూరు కాశయ్య, ఉప్పుగుండూరు లక్ష్మి, ముప్పరాజు కీర్తి సాయిశ్రీ, బస్సు డ్రైవర్ అంజిగా గుర్తించగా, మిగిలిన వారి వివరాలు ఇంకా నిర్ధారించాల్సి ఉంది. 
 
క్షతగాత్రుల ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే అధికారులు, అత్యవసర సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాదానికి మద్యం మత్తు కారణమని కొందరు ప్రయాణికులు ఆరోపించడంతో అధికారులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. గాయపడిన ప్రయాణికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ పార్కులో తొమ్మిదేళ్ల తెల్ల బెంగాల్ పులి అభిమన్యు మృతి