Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఠాగూర్
ఆదివారం, 19 మే 2024 (15:16 IST)
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఈ విమానం ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలెట్.. విమానాన్ని వెనక్కి మళ్లించి బెంగుళూరులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశాడు. దీంతో ఈ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులతోపాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను అత్యవసరంగా ఖాళీ చేయించడంతో పెను ప్రమాదం తప్పింది.
 
టేకాఫ్ అయిన కాసేపటికే విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఇంజినులో మంటల గుర్తించిన సిబ్బంది వెంటనే ఆ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)కు చేరవేశారు. ఆ వెంటనే పూర్తిస్థాయి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి వచ్చింది. విమానం ల్యాండ్ కావడానికి ముందే అగ్నిమాపక సిబ్బందిని రన్వేపై మోహరించారు.
 
విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను సురక్షితంగా కిందికి దింపినట్టు బెంగళూరు విమానాశ్రయ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. విమానం ఇంజినులో మంటలు చెలరేగడానికి గల కారణంపై దర్యాప్తు ప్రారంభించినట్టు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments