Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్ 2024 : 18న బెంగుళూరుకు వర్ష సూచన... చెన్నై ఆశలు గల్లంతేనా?

rcb - csk

ఠాగూర్

, బుధవారం, 15 మే 2024 (19:45 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ సీజన్ పోటీల్లో భాగంగా, ఈ నెల 18వ తేదీన బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్ జరిగే 18వ తేదీ శనివారం బెంగుళూరు నగరంలో వర్షం కురవొచ్చని వెదర్ డాట్ కామ్ హెచ్చరించింది. దీంతో ఏ జట్టు ఓడినా ఆ జట్టు ఫైనల్‌కు ఆశలు సంక్లిష్టమయ్యే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 
 
ఐపీఎల్ 2024 సీజన్ పోటీలు చివరిదశకు చేరుకున్నాయి. ఇప్పటివరకు రెండు జట్లు (కోల్‌కతా, రాజస్థాన్) మాత్రమే ప్లేఆఫ్స్‌ బెర్తులను ఖరారు చేసుకున్నాయి. మిగిలిన రెండు స్థానాల కోసం ఐదు జట్లు పోటీపడుతున్నాయి. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు ప్లేఆఫ్స్‌ రేసులో ముందున్నాయి. ఢిల్లీ, లక్నో నాకౌట్‌ చేరడం దాదాపు అసాధ్యమే. 
 
మే 18న చెన్నై, ఆర్సీబీ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనున్నాయి. బెంగళూరులో జరగనున్న ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు చాలా కీలకం. ముఖ్యంగా ఆర్సీబీకి ఇది చావోరేవో లాంటిది. ఇందులో ఆ జట్టు ఓడితే ప్లేఆఫ్స్‌కు చేరదు. గెలిస్తేనే అవకాశం ఉంటుంది. ఇంతటి కీలకమైన మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచిఉంది. 
 
మ్యాచ్‌ జరిగే రోజున బెంగళూరులో వర్షం కురిసే అవకాశాలు అధికంగా ఉన్నాయని వెదర్.కామ్‌ నివేదికలో వెల్లడైంది. రోజంతా 73 శాతం, సాయంత్రం 6 గంటల సమయంలో 80 శాతం వర్షం కురిసే ఛాన్స్‌ ఉందట. ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని సదరు వెబ్‌సైట్‌ పేర్కొంది. 
 
ఇదేగనుక జరిగితే మ్యాచ్‌ నిర్వహించడం సాధ్యం కాదు. ఒకవేళ మ్యాచ్‌ రద్దయితే బెంగళూరు 13 పాయింట్లతో లీగ్‌ దశను ముగిస్తుంది. చెన్నై 15 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. వరుణుడు కరుణించి మ్యాచ్‌ జరగాలని, అందులో ఆర్సీబీ గెలవాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.  
 
ఒకవేళ మ్యాచ్‌ జరిగితే చెన్నైపై ఆర్సీబీ 18 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ రన్స్‌ తేడాతో గెలవాలి లేదా చెన్నై నిర్దేశించిన లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో ఛేదించాలి. అప్పుడే సీఎస్కే నెట్‌ రన్‌రేట్‌ను ఆర్సీబీ అధిగమించి ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. బెంగళూరుపై ఓడినా చెన్నైకి అవకాశాలుంటాయి. అవన్నీ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీసీసీఐకు షాకిచ్చిన ద్రవిడ్.. కొత్త కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్!!