Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

Advertiesment
warning

ఠాగూర్

, సోమవారం, 13 మే 2024 (07:56 IST)
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో టీడీపీ ఏజెంట్లకు అధికార వైకాపా నేతలు బహిరంగ వార్నింగ్‌లు ఇస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ తరపున ఏజెంట్లుగా కూర్చొనే వారిని బెదిరిస్తున్నారు. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు అంటూ టీడీపీ ఏజెంట్‌పై వైకాపా నేతలు భౌతిక దాడికి యత్నించారు. 
 
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామానికి చెందిన సన్నారెడ్డి వేణురెడ్డిని సోమవారం జరగనున్న పోలింగ్‌లో టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీ తరపున ఏజెంట్‌గా నియమించారు. శనివారం రాత్రి వేణురెడ్డి తన వ్యవసాయ గోదాములో ఉండగా అదే గ్రామానికి చెందిన ఎన్‌డీసీసీబీ ఛైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి అనుచరులు, వైకాపాకు చెందిన పిల్లమేటి మురళి, పిల్లమేటి వంశీకృష్ణ, చెంచయ్య, నాగముంతల శ్రీనివాసులు వచ్చి కత్తులు, కర్రలు చూపుతూ తెదేపాకు ఏజెంట్‌గా ఎలా కూర్చుంటావని బెదిరించారు.
 
సత్యనారాయణ రెడ్డిని కాదని ఇక్కడ నీవు బతకగలవా అంటూ దుర్భాషలాడారు. 'నిన్ను ఇక్కడే చంపి, శవాన్ని పోలింగ్‌ కేంద్రానికి పంపిస్తే దిక్కు ఎవరు' అని బెదిరింపులకు దిగినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్‌డీసీసీబీ ఛైర్మన్‌, ఆయన అనుచరులతో ప్రాణహాని ఉందని ఆర్వోకు విన్నవించారు. దీంతో పోలింగ్ కేంద్ర వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పల్నాడు జిల్లా రెంటాలలో టీడీపీ ఏజెంట్లపై దాడి... ఈసీ సీరియస్