Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్ముడి భార్యపై లైంగిక వేధింపులు.. పురుగుల మందు తాగి..?

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:57 IST)
తమ్ముడి భార్యపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కోరిక తీర్చాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. తాడేపల్లి మండలంలోని ఉండవల్లి గ్రామానికి చెందిన జొన్న ఆదిశేషు రెండో కుమారుడు శ్రీనివాసరావుకు, పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెంకు చెందిన గీతాసురేఖకు 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు.
 
శ్రీనివాసరావు ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఆదిశేషు పెద్ద కుమారుడు శివశంకర్.. శ్రీనివాసరావు భార్యపై కన్నేశాడు. తమ్ముడి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని అతని భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కోరిక తీర్చాలంటూ పలుమార్లు వేధించాడు.
 
ఈ వేధింపులతో గీతాసురేఖ తీవ్ర మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే జనవరి 15న పురుగుల మందు తాగింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఇక, మెరుగైన చికిత్స కోసం గీతాసురేఖను విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే అక్కడ చికిత్స పొందుతూ సోమవారం గీతాసురేఖ మృతిచెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు శివశంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం