`సుల్తాన్` పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ అంటున్న రష్మిక మందన్నా
, సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (18:17 IST)
కార్తీ, రష్మిక జంటగా నటించిన సినిమా `సుల్తాన్`. తమిళ సినిమా అయినా తెలుగులోకూడా అనువదిస్తున్నారు. తెలుగు టీజర్‌ను సోమవారంనాడు సోషల్‌మీడియాలో విడుదల చేశారు. ఊరిలో పోరుకు మహాభారతంలో కృష్ణుడుకు లింక్ చేస్తూ డైలాగ్‌లు వున్నాయి. `మహాభారతంలో కృష్ణుడు పాండవులవైపు నిలుచుకున్నాడు. అదే కృష్ణుడు కౌరవుల వైపు వుంటే?` అంటూ కార్తీ.. డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. రష్మిక హాయిగా సముద్రపు ఒడ్డున నడుస్తూ కన్పిస్తుంది. ఈ టీజర్‌ను బట్టి ఇది పేద్ద కథే వున్నట్లు అర్థమవుతుంది. టీజర్ విడుదలయిన వెంటనే రష్మిక ట్వీట్ చేసింది. `సుల్తాన్ ఫర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్` అంటూ కితాబిచ్చింది. ఈ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నట్లు చెబుతోంది. ఏప్రిల్ 2న థియేటర్‌కు వస్తున్నట్లు టీజర్‌లో ప్రకటించారు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో ఎస్. ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన చిత్రమిది.
ఒక నిమిషం నిడివి కలిగిన ఈ టీజర్, "మహాభారతం చదివావా? భారతంలో కృష్ణుడు వంద అవకాశాలిచ్చినా కౌరవులు మారలేదు. నువ్వు ఇవ్వమంటోంది ఒక్క అవకాశమే కదా. ఇస్తా." అంటూ ఓ పోలీసాఫీసర్ క్యారెక్టర్ కార్తీతో అనడంతో మొదలైంది. అందుకు కార్తీ, "మహా భారతంలో కృష్ణుడు పాండవుల వైపు నిల్చున్నాడు. అదే కృష్ణుడు కౌరవుల వైపుంటే? అదే మహాభారతాన్ని ఒకసారి యుద్ధం లేకుండా ఊహించుకోండి సార్." అని సమాధానమివ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
టీజర్ ప్రకారం జోవియల్‌గా ఉండే ఓ యువకుడు తనకు ఎదురైన పరిస్థితుల కారణంగా కౌరవుల్లాంటి దుష్టులను ఎలా ఎదుర్కొన్నాడు? అతను అలా మారడానికి దారితీసిన ఆ పరిస్థితులేమిటి అనే అంశాలతో ఈ చిత్రాన్ని దర్శకుడు బక్కియరాజ్ కణ్ణన్ ఉత్కంఠభరితమైన కథనంతో తీర్చిదిద్దినట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది. టైటిల్ రోల్‌లో కార్తీ అదరగొడుతున్నారు.
హీరోయిన్ రష్మిక ఓ పల్లెటూరి యువతి క్యారెక్టర్‌లో దర్శనమివ్వనున్నారు. 'కేజీఎఫ్ చాప్టర్ 1'లో విలన్ గరుడగా పరిచయమై ఆకట్టుకున్న రామచంద్రరాజు ఈ సినిమాలో ఓ విలన్‌గా కనిపించనున్నారు. తమిళ సీనియర్ యాక్టర్ నెపోలియన్, మలయాళం పాపులర్ యాక్టర్ లాల్ పాత్రలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఎప్పట్లా యోగిబాబు నవ్వులు పండించనున్నట్లు తెలుస్తోంది.
తర్వాతి కథనం