Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మారెడు పల్లి అడవుల్లో ‘పుష్ప’ షూటింగ్...

Advertiesment
మారెడు పల్లి అడవుల్లో ‘పుష్ప’ షూటింగ్...
, సోమవారం, 25 జనవరి 2021 (19:15 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా.. సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రానున్న ఈ మూవీలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‏గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై అభిమానుల అంచనాలు తీవ్రంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం మారెడు పల్లి అడవుల్లో ‘పుష్ప’ టీం చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది. 
 
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను కేవలం ఐదు భాషల్లోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో విడుదల చేసేందుకు భావిస్తున్నాడు సుకుమార్. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‏డేట్ బయటకు వచ్చింది.
 
ప్రస్తుతం మారెడు పల్లి అడవుల్లో ‘పుష్ప’ షూటింగ్ జరుగుతుండగా.. అనంతరం పారిన్‏ వెళ్ళనున్నారట చిత్రయూనిట్. ఫారిన్ ఎందుకు వెళ్ళనున్నారంటే.. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారట. 
 
ఇక అక్కడి ట్విస్టుతోనే ఇక్కడి అడవుల్లో అసలు కథ మొదలవుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పాత్రలో మరో కోణం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అల వైకుంఠపురం తర్వాత ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్లో భారీ హిట్ కొట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

`శుభ‌సంక‌ల్పం` తర్వాత డీ గ్లామ‌ర్: ఆమ‌ని