కష్ఠాలు ఎదురైనప్పుడు ఎదిరించి పోరాడాలి కానీ ఆత్మహత్య తో జీవితాన్ని ముగించకూడదు అని చెప్పే మంచి సందేశం కూడా ఇచ్చారు. ఈ కథ మొత్తం నా పాత్ర చుట్టే తిరుగుతుంది. పోసాని కృష్ణమురళి ఓ వ్యక్తిగా చక్కగా నటించారు. అలాగే దర్శకుడు శివ కూడా చాలా అనుభవం ఉన్న దర్శకుడిగా తెరకెక్కించాడు. తప్పకుండా ఇది అందరికి నచ్చే సినిమా, అందరిపై సినిమా. నాకు కూడా కెరీర్ పరంగా చాలా సంతృప్తిని ఇచ్చిన పాత్ర ఇది. ఇంతమంచి చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని, అప్పుడే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయని అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ... ఆమని గారు ఈ సినిమాలో మెయిన్ లీడ్లో నటించారు. నటిగా ఆమె ఎన్ని భిన్నమైన పాత్రల్లో మెప్పించారో అందరికి తెలుసు. మా అమ్మ దీవెన సినిమాలో తల్లి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. తప్పకుండా ఈ సినిమాతో ఆమెకు ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ పెరుగుతుంది. ఈ చిత్రంలో ఆమె నటించడం మాకు చాలా ఆనందంగా ఉంది. తల్లి ప్రేమ గురించి గొప్పగా చెప్పే చిత్రమిది. తప్పకుండా ప్రేక్షకులు చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము అన్నారు.
దర్శకుడు శివ ఏటూరి మాట్లాడుతూ... ఇది కుటుంబం అంతా కలిసిచూసే చాలా మంచి సినిమా, ఈ నెల 29న థియేటర్స్ లో విడుదల కాబోతుంది, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది అన్నారు. ఆమని, పోసాని, నటరాజ్, శ్రీ పల్లవి, శరణ్య, సత్యప్రకాష్, శృతి, డి ఎస్ రావు, కావ్య, యశ్వంత్, నానియదవ్, అరుణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్ : జానకిరామ్, డాన్సులు : గణేష్ స్వామి, నాగరాజు, చిరంజీవి, ఫైట్స్ : నందు, పి.ఆర్ఓ. : సాయి సతీష్, పర్వతనేని, మాటలు : శ్రీను. బి, సంగీతం : ఎస్.వి.హెచ్, డి ఓ పి : సిద్ధం మనోహర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పవన్, నిర్మాత : ఎత్తరి గురవయ్య, దర్శకత్వం: శివ ఏటూరి.