Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈరోజు కొత్త అధ్యాయం అంటోన్న కీర్తి సురేశ్‌ (video)

Advertiesment
ఈరోజు కొత్త అధ్యాయం అంటోన్న కీర్తి సురేశ్‌ (video)
, సోమవారం, 25 జనవరి 2021 (16:25 IST)
త‌న‌కు ఈరోజు చాలా కొత్త‌రోజుగా వుంద‌ని.. న‌టి కీర్తి సురేష్ తెలియ‌జేసింది.  సూపర్ స్టార్ మహేష్ బాబు ,  పరశురామ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న 'సర్కారు వారి పాట` సినిమా దుబాయ్‌లో ప్రారంభ‌మైన సంద‌ర్భంగా సోమ‌వారంనాడు కీర్తి సంతోషంతో ట్వీట్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు వంటి ప్రెస్టీజియస్ వేన‌ర్‌లో న‌టించ‌డం ఆనందంగా వుంద‌ని చెబుతూ... ``కొత్త రోజు. కొత్త ప్రయాణం. కొత్త అధ్యాయం` ఆరంభ‌మైంద‌ని తెలియ‌జేసింది.
 
అంతేకాకుండా ఈరోజు సూప‌ర్ ఎక్స‌యిట్‌మెంట్‌తో వున్నాన‌ని అంటోంది.  ఇదేరోజు ద‌ర్శ‌కుడు కూడా `ఇన్నేళ్ళ నా క‌ల ఈ రోజు నిజ‌మైంది. మహేష్ బాబు గారితో వర్క్ చేయడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది.  ఈ మూవీని ఒక ఛాలెంజింగ్ తీసుకుని చేస్తున్నాను` అని తెలియ‌జేశారు.

ఆ వెంట‌నే కీర్తి ట్వీట్ చేయ‌డం విశేషం.  అయితే తాను విమానంలో ప్ర‌యాణించే పిక్‌ను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. `మ‌హాన‌టి` త‌ర్వాత కీర్తి, నితిన్‌తో `రంగ్‌దే`లో కూడా న‌టించింది. ఇప్పుడు మ‌హేశ్‌బాబుతో న‌టించ‌డం, పాట‌లో పాల్గొన‌డం.. త‌న‌కెంతో థ్రిల్ క‌లిగిస్తోంద‌ని చెబుతోంది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిహారికను ఏడ్పించిన చైతన్య.. ఎందుకో ఈ వీడియో చూస్తే..? (Video)