Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రారంభ‌మైన పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి చిత్రం

Advertiesment
ప్రారంభ‌మైన పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి చిత్రం
, సోమవారం, 25 జనవరి 2021 (15:49 IST)
పవన్ కళ్యాణ్, రాణాదగ్గుబాటి కాంబినేషన్లో సూర్యదేవర నాగవంశీ నిర్మాత‌గా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ నేడు ప్రారంభం అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనగా యాక్షన్ సన్ని వేశాలకు శ్రీకారం చుట్టారు చిత్ర దర్శకుడు సాగర్.కె.చంద్ర.
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటిల కాంబినేషన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్‘ అందిస్తున్న విషయం విదితమే.
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటిలు పాల్గొనగా పది రోజులపాటు హైదరాబాద్‌లో చిత్రం షూటింగ్ జరుగుతుందని తెలిపారు నిర్మాత. ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ.
 
ప్రముఖ నటులు సముద్ర ఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను ఈ చిత్రానికి ఇప్పటివరకు ఎంపికైన తారాగణం కాగా ఈ చిత్రానికి ప్రధాన సాంకేతిక నిపుణులుగా సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న సంగీత దర్శకుడు థమన్. ఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

అలాగే సమున్నత ప్రతిభావంతులైన 'ప్రసాద్ మూరెళ్ళ' ఛాయాగ్రాహకునిగా, ఎడిటర్‌గా  'నవీన్ నూలి', కళా దర్శకునిగా ' ఏ.ఎస్.ప్రకాష్‌లు ఇప్పటివరకు ఎంపిక అయ్యారని తెలిపారు. ఇక ఈ చిత్రంలోని ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులు ఎవరన్న వివరాలు, విశేషాలు మరో ప్రకటనలో తెలియపరుస్తామన్నారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఈ చిత్రానికి సమర్పకులుగా పి.డి.వి. ప్రసాద్ వ్యవహరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిపబ్లిక్ డే.. ఓటీటీలో సోలో బ్రతుకే సో బెటర్..