Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధృవ సర్జా, రష్మికల ''పొగరు''.. ఫిబ్రవరి 19న గ్రాండ్‌గా విడుదల

Advertiesment
ధృవ సర్జా, రష్మికల ''పొగరు''.. ఫిబ్రవరి 19న గ్రాండ్‌గా విడుదల
, బుధవారం, 20 జనవరి 2021 (15:45 IST)
Pogaru
క‌రాబు మైండు క‌రాబు మెరిసే క‌రాబు నిల‌బ‌డి చూస్తావా రుబాబు. అంటూ తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌న సృష్టించిన పొగ‌రు సాంగ్  యూట్యూబ్ లో మిలియ‌న్స్ మిలియ‌న్స్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఈ సాంగ్ పెద్ద హిట్ అవ‌డంతో తెలుగు రాష్ట్రాల్లో కుర్ర‌కారంతా గూగుల్ సెర్చ్ లో ఈ సినిమా రిలీజ్ డేట్ కొసం వెత‌క‌డం స్టార్ట్ చేశారు. అంతేకాదు ఈ సినిమా ప్రోడ‌క్ష‌న్ హౌస్ కి ఫోన్స్ చేసి రిలీజ్ డేట్ కొసం అడుగుతున్నారు. 
 
ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో వున్న క్రేజ్ వ‌ల్ల డిస్ట్రిబ్యూట‌ర్స్ కూడా రిలీజ్ డేట్ చెప్పండి అంటూ ఫోర్స్ చేస్తున్నారు. ఈ ఎక్సైట్మెంట్ కి పుల్‌స్టాప్ పెట్టారు నిర్మాత‌లు. ఫిబ్ర‌వ‌రి 19 న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నట్టు ప్ర‌క‌టించారు. ఈ చిత్రం లో దృవ స‌ర్జా హీరోగా చేస్తున్నాడు కాని ఇప్ప‌టికే దృవ స‌ర్జాలో ప్రేక్ష‌కులు త‌మ‌ని తాము చూసుకొవడం ఈ సినిమా క్రేజ్ తెలియ‌జేస్తుంది. 
 
అంతేకాకుండా క‌న్న‌డ‌, తెలుగు భాష‌ల్లో అన‌తి కాలంలోనే వ‌రుస విజ‌యాలు త‌న ఖాతాలో వేసుకున్న ర‌ష్మిక మందానా హీరోయిన్ గా చేయ‌టం ఈ చిత్రం విజ‌యాన్ని బ‌ల‌ప‌రిచింది. ఇంత క్రేజి చిత్రాన్ని  వైజాగ్ లో ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్‌, ఫైనాన్సియ‌ర్, ప్రోడ్యూస‌ర్ డి. ప్ర‌తాప్ రాజుగారు తెలుగు రైట్స్ సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు లొ సాయిసూర్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై విడుద‌ల చేస్తున్నారు. 
webdunia
Pogaru
 
ఈ సంద‌ర్బంగా నిర్మాత డి.ప్ర‌తాప్ రాజుగారు మాట్లాడుతూ..  నా కెరీర్ లో ఇలా  ఒక్క సాంగ్ తో యూట్యూబ్ లో టివి ఛాన‌ల్స్ లో రికార్డ్ వ్యూస్ ని సొంతం చేసుకుని ట్రెండింగ్  అయ్యి ఇంత క్రేజ్ తెచ్చుకున్న చిత్రాన్ని చూడ‌లేదు. తెలుగు లో ఈ  పొగ‌రు చిత్రాన్ని తెలుగు  హ‌క్కుల‌ను మా సాయిసూర్య ఎంట‌ర్‌టైన్‌మెంట్  సొంతం చేసుకొవ‌డం చాలా ఆనందం గా వుంది. 
 
ఈ సినిమా తెలుగు, క‌న్న‌డ బాష‌ల్లో సైమంటెన్స్‌గా విడుదలకి స‌న్నాహ‌లు చేస్తున్నామ‌ని క‌న్న‌డ నిర్మాత‌లు తెలిపారు. అయితే ఈ సినిమా క్రేజ్ వ‌ల‌న అటు సోష‌ల్ మీడియాలో, ఇటు ఫోన్స్ ద్వారా అభిమానులు వ‌రుస కాల్స్‌లో రిలీజ్ డేట్ చెప్ప‌మ‌న‌టం చాలా క్రేజి గా అనిపించింది. అయితే ఈ స‌స్పెన్స్ కి తెర‌దించుతూ ఫిబ్ర‌వ‌రి 19 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుద‌ల చేస్తున్నాము.
 
క‌న్న‌డ టైటిల్ పొగ‌రు కాగా తెలుగు అదే టైటిల్‌తో వ‌స్తున్నాం. వ‌‌‌రుస‌గా మూడు సూప‌ర్‌హిట్స్‌తో డ‌బుల్‌ హ్య‌ట్రిక్‌కి శ్రీకారం చుడుతూ క‌న్న‌డ‌లో దూసుకుపోతున్న దృవ స‌ర్జా, టాలీవుడ్ లో ఏ సినిమా లో న‌టిస్తే ఆసినిమా సూప‌ర్‌హిట్ అంటూ స్టాంప్ వేసుకున్న నేచుర‌ల్ బ్యూటి ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా నటిస్తున్నారు. వీరిద్ద‌రి మ‌ద్య వ‌చ్చిన క‌రాబు సాంగ్ విజువ‌ల్ గా అంద‌ర్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది. 
 
రిపీట్ గా చూస్తున్నారంటే ఈ చిత్రం పై క్రేజ్ ఏంరేంజ్ లో వుందొ తెలుస్తుంది. త‌రువాత వ‌చ్చే సాంగ్స్‌, ట్రైల‌ర్ ఇంత‌కి మించి వుంటుంది. ఈ సినిమా కి ద‌ర్శ‌కుడు నంద‌న్ కిషోర్ ఈ చిత్రాన్ని అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కి న‌చ్చేలా తెర‌కెక్కించారు. మ్యూజిక్ ద‌ర్శ‌కులు చంద‌న్ శెట్టి, అర్జున్ జ‌న్య లు ఇచ్చిన ప్ర‌తి సాంగ్ సంచ‌ల‌నం కాబోతుంది. 
webdunia
Pogaru
 
ఈ చిత్రంలో మ‌రో క్రేజ్ గా డ‌బ్ల్యూ డ‌బ్ల్యూ లో ఫేమ‌స్ ఫైట‌ర్స్ కాయ్ గ్రీనే, మోర్గ‌న్ అస్తే ,జో లిండ‌ర్‌, జాన్ లోక‌స్ లు ఈ చిత్రం లో విల‌న్స్ గా న‌టిండం విశేషం. ఈ ఇద్ద‌రి బాడి బిల్డ‌ర్స్ కి దృవ స‌ర్జా కి మ‌ద్య యాక్ష‌న్ స‌న్నివేశాలు  స‌బ్ర‌మాశ్చ‌ర్య‌‌ప‌రుస్తాయి. ఇలాంటి చాలా స‌ర్‌ప్రైజ్ లు ఈ చిత్రం లో డైర‌క్ట‌ర్ క్రియెట్ చేశాడు. జ‌న‌వరి నెలాఖ‌రు నుండి ఈ చిత్రానికి సంభందించి మ‌రిన్ని స‌ర్‌ప్రైజ్ లు ప్రేక్ష‌కుల‌కి అందిస్తాం..అని అన్నారు.
 
బ్యాన‌ర్‌.. సాయి సూర్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
సంగీతం.. చంద‌న్ శెట్టి, అర్జున్ జ‌న్య‌
పి.ఆర్‌.ఓ.. ఏలూరు శ్రీను, మేఘాశ్యామ్‌
నిర్మాత‌.. డి. ప్ర‌తాప్ రాజు
ద‌ర్శ‌కుడు.. నంద‌న్ కిషోర్‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొండ‌వీడు అందాలు బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుతో నిక్స‌న్ స్టెప్పులు