Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'క‌రాబు మైండు క‌రాబు' పాట రైట్స్ ధర రూ.3.30 కోట్లు!!

Advertiesment
'క‌రాబు మైండు క‌రాబు' పాట రైట్స్ ధర రూ.3.30 కోట్లు!!
, గురువారం, 3 డిశెంబరు 2020 (19:05 IST)
'క‌రాబు మైండు క‌రాబు మెరిసే క‌రాబు నిల‌బ‌డి చూస్తావా రుబాబు' అంటూ తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌న సృష్టించిన 'పొగ‌రు' సాంగ్‍ని ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. క‌న్న‌డంలో ఈ సాంగ్ విడుద‌లైన ద‌గ్గ‌ర‌ నుంచి మిలియ‌న్స్ మిలియ‌న్స్ వ్యూస్‌తో రికార్డులు సాధించింది. త‌ర్వాత తెలుగులో కూడా త‌న పొగ‌రు చూపించాడు స్టార్ హీరో ధృవ స‌ర్జా. 
 
తెలుగులో ఈ పొగ‌రు అనే టైటిల్‌తో వ‌స్తున్న ఈ సినిమాకి వ‌చ్చిన క్రేజ్‌కి చాలా మంది తెలుగు రైట్స్ కొసం పొటీప‌డ‌గా రూ.కోట్లకు పైగా ఫ్యాన్సి రేటుతో వైజాగ్‌లో ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్‌, ఫైనాన్సియ‌ర్, ప్రోడ్యూస‌ర్ డి. ప్ర‌తాప్ రాజు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు‌లో సాయిసూర్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై విడుద‌ల చేస్తున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత డి.ప్ర‌తాప్ రాజు మాట్లాడుతూ, ఇటీవ‌ల ఒక్క సాంగ్‌తో యూట్యూబ్‌లో టివి ఛాన‌ల్స్‌లో రికార్డ్ వ్యూస్‌ని సొంతం చేసుకుని ట్రెండింగ్‌లో వున్న పొగ‌రు క‌న్న‌డ చిత్రం తెలుగు హ‌క్కుల‌ను మా సాయిసూర్య ఎంట‌ర్‌టైన్‌మెంట్ పేరుతో రూ.3.30 కోట్లకి సొంతం చేసుకున్నాం. ఈ సినిమా సాంగ్ క‌న్న‌డ‌లో 170 మిలియ‌న్స్‌పైగా వ్యూస్ తెలుగులో 43 మిలియ‌న్స్ వ్యూస్‌కిపైగా రావ‌టం అతి పెద్ద రికార్డని చెప్పాలి. 
 
ఇంత క్రేజ్‌వ‌చ్చిన సినిమాకి మ‌న టాలీవుడ్ నుండి చాలా పెద్ద కాంపిటేష‌న్ రాగా మా సంస్థ సొంతం చేసుకొవ‌టం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా తెలుగు, క‌న్న‌డ బాష‌ల్లో సైమంటెన్స్‌గా విడుదల‌కి స‌న్నాహాలు చేస్తున్నాం. క‌న్న‌డ టైటిల్ పొగ‌రు కాగా తెలుగులో ఇంకా టైటిల్ క‌న్ఫార్మ్ చేయ‌లేదు. అతిత్వ‌ర‌లో ఈ సినిమా రేంజ్‌కి త‌గ్గ‌ట్టుగా తెలుగు‌లో టైటిల్‌ని ఎనౌన్స్ చేస్తాము. 
 
అలాగే వ‌స‌మరుస‌గా మూడు సూప‌ర్‌హిట్స్‌తో డ‌బుల్‌ హ్య‌ట్రిక్‌కి శ్రీకారం చుడుతూ క‌న్న‌డ‌లో దూసుకుపోతున్న ధృవ స‌ర్జా, టాలీవుడ్‌లో ఏ సినిమాలో న‌టిస్తే ఆసినిమా సూప‌ర్‌హిట్ అంటూ స్టాంప్ వేసుకున్న నేచుర‌ల్ బ్యూటి ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా నటిస్తున్నారు. వీరిద్ద‌రి మ‌ద్య వ‌చ్చిన 'క‌రాబు సాంగ్' విజువ‌ల్‌గా అంద‌ర్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది. రిపీట్‌గా చూస్తున్నారంటే ఈ చిత్రంపై క్రేజ్ ఏంరేంజ్‌లో ఉందో తెలుస్తుంది. త‌ర్వాత వ‌చ్చే సాంగ్స్‌, ట్రైల‌ర్ ఇంత‌కి మించి వుంటుంది. ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు నంద‌న్ కిషోర్. 
 
ఈ చిత్రాన్ని అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కి న‌చ్చేలా తెర‌కెక్కించారు. మ్యూజిక్ ద‌ర్శ‌కులు చంద‌న్ శెట్టి, అర్జున్ జ‌న్యలు ఇచ్చిన ప్ర‌తి సాంగ్ సంచ‌ల‌నం కాబోతుంది. ఈ చిత్రంలో మ‌రో క్రేజ్‍గా డ‌బ్ల్యూడ‌బ్ల్యూలో ఫేమ‌స్ ఫైట‌ర్స్ కాయ్ గ్రీనే, మోర్గ‌న్ అస్తే, జో లిండ‌ర్‌, జాన్ లోక‌స్‌లు ఈ చిత్రం‌లో విల‌న్స్‌గా న‌టిండం విశేషం. ఈ న‌లుగురి బాడి బిల్డ‌ర్స్‌కి ధృవ స‌ర్జాకి మ‌ధ్య యాక్ష‌న్ స‌న్నివేశారు సంభ్రమాశ్చ‌ర్య‌‌ప‌రుస్తాయి. ఇలాంటి చాలా స‌ర్‌ప్రైజ్‌లు ఈ చిత్రంలో డైర‌క్ట‌ర్ క్రియెట్ చేశాడు. ఇంకా మ‌రిన్ని విష‌యాల్ని మ‌రోక్క‌సారి తెలియ‌జేస్తామంటూ ముగించారు. 
 
బ్యాన‌ర్‌.. సాయి సూర్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
సంగీతం.. చంద‌న్ శెట్టి, అర్జున్ జ‌న్య‌
పి ఆర్ ఒ.. ఏలూరు శ్రీను
నిర్మాత‌.. డి.ప్ర‌తాప్ రాజు 
ద‌ర్శ‌కుడు.. నంద‌న్ కిషోర్‌ 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోవాలో ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని 'క్రాక్' మూవీ లాస్ట్ షెడ్యూల్‌