Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళింట విషాదం.. కొన్ని క్షణాల్లో తల్లీ కుమారుడు మృతి!!

Webdunia
ఆదివారం, 7 నవంబరు 2021 (09:40 IST)
అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్రంలో ఓ పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. కొన్ని నిమిషాల వ్యవధిలో తల్లీ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ ఇంట విషాదం చుట్టుముట్టింది. పెళ్లి తంతు పూర్తయిన కాసేపటికే వరుడి నాయనమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలిసిన మృతురాలి కుమారుడు కుప్పకూలి మరణించాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మండలంలోని కొర్రపాడుకు చెందిన వెంకటస్వామి (56) పామిడి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా పని చేస్తున్నారు. ఈయన కుమారుడు గోవర్థన్ వివాహం శనివారం ఘనంగా నిర్వహించారు. 
 
అయితే, అప్పటికే అనారోగ్యంతో బాధపడుతూ మంచానఉన్న వెంకటస్వామి తల్లి కోన్నమ్మ (70)ను మూడు రోజుల క్రితం అనంతపురంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, అప్పటికే పెళ్లి సమయం దగ్గరపడడం, వాయిదా వేసుకునే అవకాశం లేకపోవడంతో బాధగానే వెంకటస్వామి తన కుమారుడి పెళ్లి జరిపించారు. 
 
ఈ క్రమంలో వివాహం ముగిసిన కాసేపటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి మరణించిందన్న వార్త వెంకటస్వామికి తెలిసింది. అది విన్నవెంటనే ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన బంధువులు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. తల్లి, కుమారుడు మరణించడంతో పెళ్లింట విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments