కరోనా తర్వాత థియేటర్లు తెరుచుకుని పండుగ వాతావరణం నెలకొన్న తరుణంలో ఓటీటీ అమెజాన్ దూకుడు పెరిగింది. పలు మలయాళ చిత్రాలను విడుదల చేసిన అమెజాన్ ఈసారి మరక్కార్ ను విడుదల చేయబోతోంది. మోహన్‌లాల్, ప్రియదర్శన్ ల కలల సినిమా `మరక్కార్` వెండితెరపై కంటే ఓటీటీలో రాబోతుంది. మాలీవుడ్‌లో బాహుబలి సినిమాగా పేరు పొందిన ఈ సినిమాకు వంద కోట్ల ఖర్చుతో నిర్మించారు. మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ అని కాప్షన్‌తో రూపొందిన ఈ సినిమా త్వరలో అమెజాన్‌లో రాబోతుంది. అయితే దీనిపై పంపిణీదారులు చాలా నిరుత్సాహంతో వున్నారు.
కథరీత్యా కుంజాలి పాత్రను మోహన్‌లాల్ పోషించాడు. కుంజాలి ఆఖరి రక్తపుబొడ్డు వరకు పరదేశీయులను రానివ్వనని మోహన్‌లాల్ డైలాగ్‌లు ఆమధ్య విడుదలై అనూహ్యస్పందన లభించింది. కుంజాలి చిన్నతనపు పాత్రను మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ పోషించాడు. ఇందులో అర్జున్, సుహాసిని, సునీల్‌శెట్టి, సుదీప్ వంటి ఎంతోమంది తారలు నటించారు.
67వ జాతీయ పురస్కారాలలో మరక్కార్‌కు కాస్ట్యూమ్స్‌తోపాటు పలు శాఖలకు అవార్డులు దక్కాయి. మోహన్‌లాల్‌తో 45 సినిమాలు చేసిన ప్రియదర్శిన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2020లో విడుదలకావాల్సి వున్నా కోవిడ్ కారణంగా విడుదల కాలేదు. అయితే ఇప్పుడు ఓటీటీలో విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. అమెజాన్ భారీ ఆఫర్ ఇవ్వడం విశేసం. అయినా సరే పంపిణీదారులు ఆందోలన వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత: ఆంటోనీ పెరుంబవూర్, సంగీతం రోన్నీ రాఫేల్, రాహుల్ సమకూర్చారు.