Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"క్షీర సాగర మథనం" కు పది కోట్ల వీక్షణలు!

Advertiesment
ksheera sagara mathanam
విజ‌య‌వాడ‌ , శనివారం, 16 అక్టోబరు 2021 (10:44 IST)
"బిగ్ బాస్" ఫేమ్ మానస్ నాగులపల్లి హీరోగా నటించిన "క్షీర సాగర మథనం" చిత్రానికి అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికి ఈ చిత్రానికి "పది కోట్ల వీక్షణలు" నమోదయ్యాయి. విడుదలైన మూడు నాలుగు రోజులకే టాప్-2లో స్థానం సంపాదించుకున్న ఈ చిత్రం ఇప్పటికీ టాప్ 5లో కొనసాగుతుండడం విశేషం.
 
ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్,... అక్షత సోనావని, చరిష్మా శ్రీకర్, ప్రదీప్ రుద్ర ఇతర ముఖ్య తారాగణంగా... యువ ప్రతిభాశాలి అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన "క్షీరసాగర మథనం" చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ నిర్మించింది. ఆగస్టు 6న థియేటర్స్ లో విడుదలై, కరోనా కారణంగా పరిమిత ఆదరణ పొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న "అమెజాన్ ప్రైమ్"లో విడుదలై అనూహ్య స్పందనతో దూసుకుపోతోంది. తమ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతుండడం ఉక్కిరిబిక్కిరి చేస్తోందని దర్శకుడు అనిల్ పంగులూరి అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గాంధీ స్థూపానికి ఎన్.ఎస్.జి. క‌మెండోల శాల్యూట్!