Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దీపావళికి వస్తోన్న జై భీమ్.. న్యాయవాదిగా సూర్య..

Advertiesment
దీపావళికి వస్తోన్న జై భీమ్.. న్యాయవాదిగా సూర్య..
, శుక్రవారం, 1 అక్టోబరు 2021 (16:50 IST)
Jai Bheem
సింగం హీరో సూర్య నటించిన జై భీమ్ ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ దీపావళి 2 నవంబర్, 2021న విడుదల కానుంది. నవంబర్ 2వ తేదీన దేశంలోనే కాకుండా 240 దేశాల్లో విడుదల నుంది. కోర్టు డ్రామాగా జై భీమ్ తెరకెక్కనుంది. 
 
2 డి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య మరియు జ్యోతిక నిర్మించిన టిజె జ్ఞానవేల్ రచన మరియు దర్శకత్వం వహించిన జై భీమ్ సినిమా గిరిజనుల కోసం అన్ని సమస్యలతో పోరాడుతున్న న్యాయవాది పాత్రలో సూర్య పోషిస్తున్నారు. 
 
ప్రకాష్ రాజ్, రావు రమేష్, రాజీషా విజయన్, లిజో మోల్ జోస్ వంటి నటీనటుల సమిష్టి తారాగణం కూడా ఉంది. జై భీమ్ సీన్ రోల్డాన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని రాజశేఖర్ కర్పూరసుందరపాండియా సంయుక్తంగా నిర్మించారు. జై భీమ్ తెలుగులో కూడా నవంబర్ 2వ తేదీనే విడుదల చేయనున్నారు.
 
సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం.. గిరిజన జంట సెంగేని మరియు రాజకన్ను జీవితాలను లోతుగా పరిశోధించడం జరిగింది. రాజకన్ను అరెస్టు కావడం.. చివరికి ఎలాంటి క్లూ లేకుండా అదృశ్యం కావడం.. వ్యాధి బారిన పడటం.. ఆ సమయంలో సెంగేని న్యాయవాదిని సాయం కోరడం జరుగుతుంది. 
 
ఇంకా సత్యాన్ని వెలికితీసేందుకు, రాష్ట్రంలోని నిరుపేద గిరిజన మహిళలకు న్యాయం చేయడానికి సూర్య సిద్ధమవుతాడు. చివరకు న్యాయం గెలుస్తుందా? తెలుసుకోవడానికి, 2 నవంబర్, 2021.. ఈ దీపావళికి విడుదలయ్యే అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప‌వ‌న్ క‌ళ్యాణ్, పోసాని మ‌ధ్య‌ వివాదానికి కార‌ణం వారేః న‌ట్టికుమార్‌