2013 నాటి పాట్నా బాంబ్ పేలుళ్ల కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించింది ఎన్ఐఎ కోర్టు. 2014 లోక్ సభ ఎన్నికలకు నరేంద్ర మోడీని బీజేపీ ప్రచార కమిటీ చీఫ్‌గా ప్రకటించింది.
ఈ సందర్భంగా 2013 అక్టోబర్ 27న పాట్నాలోని గాంధీ మైదానంలో హుంకార్ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించింది. మోడీతో పాటు, అప్పట్లో బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న రాజ్ నాథ్ సింగ్, నాటి రాజ్యసభ ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ సహా కీలక నేతలంతా పాల్గొన్నారు.
సభ జరుగుతుండగానే... గాంధీ మైదానంలో వరుస పేలుళ్లు జరిగాయి. ఆరుగురు చనిపోగా... అనేక మంది గాయపడ్డారు. ఈ కేసును NIA దర్యాప్తు చేసింది. 9 మందిని దోషులుగా తేల్చింది కోర్టు. అందులో నలుగురికి ఉరిశిక్ష, ఇద్దరికి యావజ్జీవ కారాగా శిక్ష, మరో ఇద్దరికి పదేళ్ల జైలు శిక్ష, ఒకరికి ఏడేళ్ల జైలు శిక్ష వేసింది కోర్టు.