భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోమ్ నగరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పియాజా గాంధీ వద్ద మహాత్మ గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. ప్రపంచానకి ఆయన అందించిన స్ఫూర్తి కొనసాగుతుందని అన్నారు.
జీ-20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రోమ్ నగరానికి వెళ్లిన విషయం తెల్సిందే. ఈ పర్యటనలో ఎనిమిది దేశాల నేతలు లేదా అధినేతలతో సమావేశమవుతారు. ఇటలీ, స్పెయిన్, సింగపూర్ ప్రధానులు, జర్మనీ ఛాన్సలర్, ఫ్రాన్స్, ఇండోనేషియా అధ్యక్షులతో ప్రధాని మోడీ భేటీ కానున్నారు.
దీంతో పాటు యూరోపియన్ యూనియన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులతో ప్రధాని మోడీ భేటీ కానున్నారు. దౌత్య సమావేశాలే కాకుండా అందరి దృష్టి ప్రధాని మోడీ, పోప్ ఫ్రాన్సిస్‌ల భేటీపైనే ఉంటుంది. అక్టోబర్ 30 ఉదయం వాటికన్ ప్రైవేట్ లైబ్రరీలో పోప్‌తో ప్రధాని భేటీ అవుతారు. కార్డినల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా పిలిచే వాటికన్‌లో పోప్ ముఖ్య సలహాదారుని కూడా ప్రధాని మోడీ కలవనున్నారు.