Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందుకేనా పెట్రోల్ రేట్ తగ్గించింది? ఏం తెలివి మోడీజీ?

అందుకేనా పెట్రోల్ రేట్ తగ్గించింది? ఏం తెలివి మోడీజీ?
, శుక్రవారం, 5 నవంబరు 2021 (20:17 IST)
ఎన్నికలంటే అందరికీ భయమే. ఎన్నికల్లో అధికారంలోకి వస్తేనే ఏదైనా చేయగలుగుతాం. అధికారంలోకి రావాలంటే ప్రజలు నమ్మాలి. ఓటెయ్యాలి. ఇదంతా తెలిసిందే. అయితే ఉన్నట్లుండి కేంద్రప్రభుత్వం పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించడమేంటని అందరూ అనుకుంటూ ఉన్నారు. 

 
అయితే ఇందులో మోడీ ప్లాన్ ఉందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే 13 రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ మూడు లోక్ సభ నియోజకవర్గాలకు అక్టోబర్ 30వ తేదీన జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో బిజెపి అగ్రనేతలు మేల్కొన్నారు. 

 
మరికొన్నిరోజుల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తప్పనసరిగా భావించారట. అందుకే ఉన్నట్లుండి దీపావళి కానుక అంటూ 5 రూపాయల దాకా పెట్రోల్ రేటును తగ్గించారట. 

 
అంతేకాదు బిజెపి పాలిత రాష్ట్రాలైన అసోం, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు వ్యాట్‌లో కోత కూడా విధించాయి. దీంతో భారీగా పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గాయట. ఇక నుంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా నిర్ణయాలు ఉండాలన్న ఆలోచనలో కూడా ఉన్నారట మోడీ. 

 
ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటి రెండుసార్లు ఆలోచించాలని.. అలాగే నిపుణులు సలహాలు కూడా తీసుకోవాలని కూడా మోడీ సూచిస్తున్నారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు, నారా లోకేష్ పైన రోజా తీవ్ర విమర్శలు