ఇరాక్ ప్రధాని నివాసంపై డ్రోన్ దాడి.. సురక్షితంగా ఉన్నానటు కమిది వెల్లడి

Webdunia
ఆదివారం, 7 నవంబరు 2021 (09:20 IST)
ఇరాక్ దేశ ప్రధానమంత్రి ముస్తాఫా అల్-కదిమి నివాసంపై ఆదివారం తెల్లవారుజామున డ్రోన్ల సాయంతో బాంబు దాడి జరిగింది. పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలతో నిండిన ఓ డ్రోన్‌తో బాగ్దాద్‌లోని ఆయన నివాసంపై దాడి జరిగినట్టు భద్రతా దళాలు వెల్లడించాయి. 
 
అయితే, ఈ డ్రోన్ దాడి నుంచి ప్రధాని అల్ కమిది సురక్షితంగా బయటపడ్డారు. కానీ, ఆయన రక్షణ సిబ్బంది పలువురు గాయపడ్డారు. గత నెలలో జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో హింస చోటుచేసుకున్న విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో తాజా దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని నివాసంపై డ్రోన్ దాడి ఘటనకు ఇప్పటివరకు ఎవరూ నైతిక బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. డ్రోన్ దాడి జరిగిన ప్రాంతం గ్రీన్ జోన్ కావడం గమనార్హం. 
 
పైగా, ఇక్కడ అనేక ప్రభుత్వ భవనాలు, విదేశీ దౌత్య కార్యాలయాలు ఉంటాయి. ప్రధాని నివాసంపై దాడి ‘ఆరోగ్యకరం’ కాదని  ఇరాక్ మిలటరీ పేర్కొంది. అంతకుమించి వివరాలు వెల్లడించలేదు. ప్రధాని సురక్షితంగా ఉన్నారని, అందరూ సంయమనం పాటించాలని ప్రధాని ట్విట్టర్ ఖాతా పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments