Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్లోరిడాలో కుప్పకూలిన 12 అంతస్తుల భవంతి... 121మంది ఆచూకీ గల్లంత

Advertiesment
Explosives Bring Down
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం 12 అంత‌స్తుల భ‌వ‌నం ఒక‌టి స‌గం కూలగా, ఈ భవనం కూలిన ఘ‌ట‌నలో 24 మంది మృత‌దేహాల‌ను వెలికితీశారు. ఇంకా 121 మంది ఆచూకీ లేదు. 
 
అయితే ఆ బిల్డింగ్‌కు చెందిన మ‌రో భాగాన్ని.. ఆదివారం పేలుడు ప‌దార్ధాలు పెట్టి కూల్చేశారు. ఫ్లోరిడాలోని స‌ర్ఫ్‌సైడ్‌లో ఉన్న ఆ బిల్డింగ్ ఇటీవ‌ల అక‌స్మాత్తుగా కూలింది. ఆ ఘ‌ట‌న‌లో 150 మంది వ‌ర‌కు మిస్సైయ్యారు. 
 
ఆ ప్ర‌మాద ఘ‌ట‌నా స్థ‌లాన్ని అధ్య‌క్షుడు జో బైడెన్ కూడా విజిట్ చేశారు. ఇటీవ‌లే ఆయ‌న మృతుల‌కు నివాళి అర్పించారు. అయితే కూలిన శిథిలాల నుంచి మృత‌దేహాల‌ను వెలికి తీయాలంటే.. అక్క‌డ ప్ర‌స్తుతం ఉన్న సగం బిల్డింగ్‌ను కూల్చాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ఆదివారం రాత్రి ఆ బిల్డింగ్‌లో మిగిలిన భాగాన్ని నియంత్రిత ప‌ద్ధ‌తిలో పేల్చేశారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూపీ పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటిన తెలుగు అమ్మాయి!