Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిఎం ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కినందుకు జగన్ గారికి అభినందనలు

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (13:37 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి గారికి పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నందుకు స్కాచ్ గ్రూప్ సంస్థ "సిఎం ఆఫ్ ది ఇయర్" అవార్డుతో సత్కరించిన సందర్భంగా AP JAC అమరావతి రాష్ట్ర కమిటీ తరపున ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయ పూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియచేస్తున్నామని ఏపీ జేఏసి అమరావతి సభ్యులు పేర్కొన్నారు.
 
ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రధానంగా ఆరోగ్య శ్రీ, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్ చేయూత (Ysr cheyutha )పథకం ద్వారా మధ్య వయస్కులైన మహిళలకు నగదు ఇవ్వడం ద్వారా మహిళల సాధికారతకు సహకారం వంటి పథకాలతో పేదలకు అండగా నిలుస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రఖ్యాత స్కాచ్‌ గ్రూపు సీఎం ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు (Cm of the year award)తో స్కాచ్ గ్రూప్ ఛైర్మన్ సమీర్ కొచ్చర్ స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి సత్కరించడం మా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, ప్రజలు గర్వించదగ్గ విషయం అని చైర్మన్ బొప్పరాజు మరియు సెక్రెటరీ జనరల్ వైవీ రావులు తెలిపారు.
 
ఇవే కాక ఇంకా అనేక సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు నేరుగా తీసుకుని వెళ్లడం ఉదాహరణకు...
 ఇంటింటికి నిత్యావసర వస్తువుల పంపిణీ, సామాజిక పెన్షన్ల పంపిణీని వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపడం, 25 లక్షల మందికి ఇంటి పట్టాల పంపిణీ లాంటి గొప్ప కార్యక్రమాలు మరీ ప్రత్యేకంగా అన్నీ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులను సిద్ధంచేసి కరోనా కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం చూపిన చొరవను దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వచ్చింది.
 
 
అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో పని చేస్తున్న చిరు ఉద్యోగులు, కార్మికులు జీతాలు పెంచడం ఉదాహరణకు VRAలు, హోంగార్డుల జీతాలు పెంచడం, పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచడం చాలా సంతోషించాం. మరీ ప్రత్యేకంగా దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయని సాహసం అనగా RTC ఉద్యోగులను దాదాపు 70,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అంశం. నూతన ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా రాబోయే రోజుల్లో 11వ PRC అమలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై కూడా తప్పకుండా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని మాకు ముఖ్యమంత్రి గారిపై సంపూర్ణ నమ్మకం ఉందని బొప్పరాజు, వైవీ రావులు తెలిపారు.
 
 
ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత గొప్ప అవార్డ్ రావడంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రవేశ పెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు చేసిన కృషి కూడా మారువలేనిదని,
ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయటం ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డ్లు ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే విధంగా మా పనితీరు కనబరుస్తామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments