Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జిడ్డు కృష్ణమూర్తి వర్ధంతి.. ఆ నది సముద్రంలో కలిసే చోట ఆడుకునే వాళ్లట..

జిడ్డు కృష్ణమూర్తి వర్ధంతి.. ఆ నది సముద్రంలో కలిసే చోట ఆడుకునే వాళ్లట..
, బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (12:06 IST)
Jiddu Krishnamurti
తత్వవేత్త అయిన జిడ్డు కృష్ణమూర్తి వర్ధంతి నేడు. 1895లో మదనపల్లెలో జన్మించిన ఆయన మద్రాసులో నివాసం వుండేవారు. మద్రాసులోని "అడయారు" దివ్యజ్ఞాన సమాజానికి అంతర్జాతీయ కేంద్రంగా ఉండేది. అనీ బిసెంట్ దానికి అధ్యక్షురాలు. కృష్ణమూర్తి, అతను తమ్ముడు నిత్యానంద కలసి అడయారు నది సముద్రంలో కలిసే చోట నిత్యమూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు. 
 
1929 నుండి 1986లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశారు. అతను స్పృశించిన ముఖ్యాంశాలు మానసిక విప్లవం, మనోభావ విచారణ, ధ్యానం, మానవ సంబంధాలు, సమాజంలో మౌలిక మార్పు వంటివి. మనిషి తనంతట తానుగా భయం, కట్టుబాట్లు, అధికారం, మూఢవిశ్వాసాల నుండి విముక్తి చెందాలని బోధించాడు.
 
అడయారు గ్రంథాలయాధికారి ఈ సోదరులిద్దరినీ చూసి ఆకర్షింపబడ్డాడు. ఈ విషయం డాక్టర్ అనిబిసెంట్ కి తెలియజేసి, ఆ ఇద్దరినీ ఆమె వద్దకు రప్పించాడు. ఆ సొదరులిద్దరినీ చూసి అనిబిసెంట్ కూడా చాలా ప్రభావితురాలైంది. అంతటితో వారిద్దరినీ విద్యార్జన నిమిత్తం ఇంగ్లాండ్ పంపించింది. కృష్ణమూర్తిని జగద్గురువుగా భావించిన డాక్టర్ అనిబిసెంట్ "ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్" అనే ఒక అంతర్జాతీయ సంఘాన్ని స్థాపించి, కృష్ణమూర్తిని దానికి ప్రధానిని చేసింది. 
 
కానీ, ప్రతి సంవత్సరం భారతదేశానికి వస్తుండేవారు. తెలుగువారైనా తెలుగు దాదాపు మరచిపోయారు. ఈ గ్రంథకర్త "ఆంధ్రప్రభ" సచిత్ర వార పత్రిక సంపాదకులుగా ఉన్నప్పుడు, ప్రతి సంవత్సరం కృష్ణమూర్తితో ఒక ఇంటర్వ్యూ ప్రకటించడం ఆనవాయితీగా ఉండేది. కృష్ణమూర్తిని గురించి సమగ్రంగా అధ్యయనం చేసిన శ్రీ నీలంరాజు లక్ష్మీ ప్రసాద్‌ ఈ ఇంటర్వ్యూను నిర్వహిస్తుండేవారు.
 
కృష్ణమూర్తి జీవితం చివరి సంవత్సరం వరకు ఈ ఇంటర్వ్యూల ప్రచురణ కొనసాగింది. ఒక సారి "మీరు తెలుగువారు కదా. తెలుగు ఏమైనా జ్ఞాపకం ఉందా?" అని ప్రశ్నిస్తే ఒంట్లు లెక్కించడానికి ప్రయత్నించి, మూడు - నాలుగు అంకెలు పలికి, ఇటాలియన్‌ భాషలోకి మారిపోయారు. తాను గురువును గానీ, ప్రవక్తను గానీ కానని అతను చాలా సార్లు ఖండితంగా ప్రకటించారు. అతను బోధించిన తత్త్వం ఏ నిర్ణీత తాత్త్విక చట్రంలోకీ ఇమడదు. దాని ప్రత్యేకత దానిదే. సమస్త జీవరాసుల పట్ల అతను కారుణ్యాన్ని వ్యక్తం చేస్తుండేవారు. తనదంటూ ఏ వస్తువునూ అతను ఏర్పరచుకోలేదు, మిగుల్చుకోలేదు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినీ ఆఫర్ కోసం వచ్చిన అందమైన యువకుడిపై సామూహిక లైంగిక దాడి, ఎక్కడ?