ఏపీలో బెండకాయలు, దొండకాయలకు మంచి డిమాండ్ ఏర్పడింది. వీటి ధరలు రైతు బజార్లలో కిలో రూ.40, రూ.30 వరకూ పలుకుతుండగా బహిరంగ మార్కెట్లలో కిలో రూ.60 వరకూ అమ్ముతున్నారు.
బెండ, దొండకాయల సాగు ఇప్పుడిప్పుడే ప్రారంభించడం, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సి రావడంతో వీటి ధర ఎక్కువగా ఉంటోందని రైతులు చెబుతున్నారు. మరో నెల రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు.
దోసకాయ, చిక్కుళ్లు, క్యాప్సికం ధర కూడా పెరిగింది. రైతుబజార్లలో దోసకాయ కిలో రూ.20లకు, చిక్కుళ్లు, క్యాప్సికం రూ.40కు విక్రయిస్తున్నారు. అయితే, ఇతర కూరగాయలు సామాన్యులకు కాస్త అందుబాటులోనే ఉన్నాయి.
రైతు బజార్లలో... టమోటా కిలో రూ.13, వంకాయలు దొమ్మేరు రకం రూ.24, ఇతర వెరైటీలు రూ.20, రూ.22, పచ్చిమిర్చి సన్నాలు రూ.20, పందిరి బీర కాయలు రూ.28, కేరట్ బెంగుళూరు రూ.15, బంగాళదుంపలు రూ.12కు విక్రయిస్తున్నారు.