Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగొద్దురా మగడా.. అంటే భార్యను చంపేశాడు..

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (11:34 IST)
మద్యం తాగి తాగి జీతం మొత్తాన్ని ఖర్చు చేసేస్తున్నావని.. మద్యం తాగడం మానేయండని భార్య చెప్పినందుకు భర్త ఆమెనే హతమార్చాడు. ఈ ఘటన  మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెదక్‌జిల్లా నారాయణ్‌ ఖేడ్‌కు చెందిన సంజీవ్‌తో ఆర్‌సీపురానికి చెందిన రాణి (42)కి 25 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. 
 
సంజీవ్‌ స్టేట్‌ టీబీ ట్రైనింగ్‌ సెంటర్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురికి వివాహమైంది. సంజీవ్‌కు ప్రతి నెలా సుమారు రూ.70 వేల వరకు వేతనం వస్తోంది. 
 
మద్యానికి అలవాడు పడ్డ ఆయన వచ్చిన వేతనంలో ఎక్కువ భాగం మద్యం కోసం ఖర్చు పెట్టేవాడు. స్నేహితులతో కలిసి విందులు, వినోదాలు చేసుకునేవాడు. ఈ విషయంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సెలవులు కావడంతో ఇద్దరు పిల్లలు ఆర్‌సీపురంలోని అమ్మమ్మ వద్ద ఉంటున్నారు. 
 
రాత్రి ఎప్పటి లాగే మద్యంతాగి వచ్చిన భర్తతో గొడవ పడింది. దీంతో సంజీవ్‌ భార్యను తీవ్రంగా కొట్టాడు. కొడుకు, కూతురుకు ఫోన్‌ చేసి మీ నాన్న తనను కొడుతున్నాడని చెప్పింది. ఆ తరువాత సంజీవ్‌.. భార్యను కత్తితో ఛాతిపై పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న సంజీవ్‌ను గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments