కరోనా అనేది మీ భార్య లాంటిది, కంట్రోల్ చేయాలనుకుంటారు.. కానీ..?

శుక్రవారం, 29 మే 2020 (17:27 IST)
Indonesia Minister
ఇండోనేషియాకు చెందిన మంత్రి మహ్మద్ మహ్ఫుద్ ఎండీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ తిరుగుబాటు వ్యక్తితం కలిగిన భార్య లాంటిదన్నారు. ''కరోనా అనేది.. మీ భార్య లాంటిది. మొదట్లో మీరు ఆమెన్ కంట్రోల్ చేయాలని అనుకుంటారు. అయితే కంట్రోల్ చేయలేరని తర్వాత తెలుసుకుంటారు. ఇక చేసేదేమీ లేక సహజీవనం ప్రారంభిస్తారు'' అని ఓ మీమ్‌లో వుంది. ఆ మీమ్‌లో వున్నది నిజమే. ప్రస్తుత పరిస్థితి అలాంటిదేనని ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన ఓ కర్యాక్రమంలో మంత్రి మహ్మద్ అన్నారు.
 
కాగా, ఇండోనేషియాలోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను ప్రభుత్వం సడలించింది. అయితే లాక్‌డౌన్ సడలింపుపై ప్రజల్లో భయాన్ని తొలగిస్తూ వారికి మానసిక ధైర్యాన్ని ఇచ్చే క్రమంలో మంత్రి అహ్మద్ ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ మంత్రి మహ్మద్ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే లేచింది. మహిళా సంఘాలు, నెటిజెన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.
 
ఇండోనేషియాలో ఇప్పటివరకు 24,000 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 1,496 మంది కరోనా వల్ల మృతి చెందారు. కాగా కరోనా టెస్టులు తక్కువగా చేసిన దేశాల్లో ఇండోనేషియా ఒకటి. ప్రపంచ సగటు కంటే కూడా ఇండోనేషియాల్లో చాలా తక్కువ టెస్టులు చేయడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అందరికీ అందుబాటులో మద్యం, మాదకద్రవ్య విమోచన కేంద్రాలు