Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో యువతిని గర్భవతిని చేసిన పాస్టర్..

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (23:17 IST)
దైవ సందేశాలను చెప్పాల్సిన పాస్టర్ ప్రేమ పేరుతో యువతిని మోసం చేసి గర్భవతిని చేసాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోరికలు తీర్చుకున్నాడు. సదరు యువతి గర్భం దాల్చేసరికి అబార్షన్ చేయించాడు. అంతా అయిన తర్వాత ప్రియురాలిని కాదని మరొక యువతిని పెళ్లి చేసుకున్నాడు.
 
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నెల్లిపట్ల గ్రామ పంచాయితీ పరిధిలోని జంగాల అగ్రహారంలో ఓ యువకుడు పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామంలోని ఓ యువతితో ఆరేళ్లపాటు సన్నిహితంగా మెలిగాడు. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. ఆమెకు గర్భం వచ్చిందని తెలుసుకుని, అబార్షన్ చేయించాడు. అయితే కొన్నాళ్లుగా ఆమెకు కనిపించకుండా తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు. పాస్టర్ ప్రవర్తనపై అనుమానంతో ఆమె గ్రామపెద్దల వద్ద పంచాయితీ పెట్టింది.
 
పాస్టర్ ట్రైనింగ్ పూర్తయిన వెంటనే పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. అయితే ఇచ్చిన మాట పక్కన పెట్టి, కొన్నాళ్లకు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతడి చేతిలో మోసపోయిన సదరు మహిళ బైరెడ్డిపల్లి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాస్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments