కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మనిషి జీవిన విధానమే పూర్తిగా మారిపోయింది. ఈ వైరస్ బారినపడకుండా ఉండాలంటే సామాజిక భౌతిక దూరం తప్పనిసరి అయింది. దీనికితోడు ముఖానికి మాస్క్ ధరించడం విధిగా మారిపోయింది. ఈ రెండు ఆంక్షలు ప్రేమికులకు, వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారికి తీవ్ర ప్రతిబంధకంగా మారింది. పైగా, బ్రిటన్ దేశంలో లాక్డౌన్ వేళ సరికొత్త ఆంక్షను జూన్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి తెచ్చింది.
తాజా ఆదేశాలు ఆ దేశస్థులను భౌతికంగా మరింత దూరం చేయనున్నది. వైవాహిక బంధంలో లేని ఇద్దరూ.. రహస్య ప్రదేశంలో కలుసుకోవడంపై నిషేధం విధించారు. వేర్వేరు ఇళ్ళకు చెందిన ఇద్దరు.. పబ్లిక్‌గా కానీ, ప్రైవేటుగా కానీ కలవకూడదని తాజా ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నిబంధన నేటి నుంచి అమలులోకి వచ్చింది.
నిజానికి లాక్డౌన్, సామాజిక భౌతికదూరం వల్ల ప్రేమికుల మధ్య తీవ్ర అగాధం ఏర్పడినట్లు కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. శారీరకంగా, మానసికంగా బాగుండాలంటే, లాక్డౌన్ వేళ సెక్స్ తప్పనిసరిగా అని మానకిస వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ, బ్రిటన్ తాజా ఆదేశాలు ప్రేమికులను మరింతగా డిప్రెషన్‌లోకి నెట్టనున్నాయి.