బాలీవుడ్ హీరోయిన్‌పై కన్నేసిన టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్!

ఆదివారం, 31 మే 2020 (13:05 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ బ్యాచిలర్ ఎవరయ్యా అంటే ఇపుడు ఠక్కున చెప్పే పేరు ప్రభాస్. ఆయన సాహో తర్వాత రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కలిసి పని చేయనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి నాగ్ అశ్విన్ ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు. 
 
అయితే, ఈ చిత్రంలో నటించే హీరోయిన్‌ ఎవరన్నదానిపై ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు రష్మిక మందన్నా, పూజా హెగ్డే అలా పలువురి పేర్లు వినిపించాయి. ఇపుడు బాలీవుడ్ నటి దీపికా పదుకొనే పేరు తెరపైకి వచ్చింది. దీనికి దీపిక తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్ మరింత బలం చేకూర్చుతోంది. 
 
'మహానటి' సినిమాను అందరూ చూడండి అని దీపిక కామెంట్ పెట్టింది. దీనికి కొనసాగింపుగా... తెల్లవారుజామున కూల్ నోటిఫికేషన్ అందుకున్నాను అంటూ నాగ్ అశ్విన్ తన సోషల్ మీడియా పేజ్‌లో రాశాడు. దీంతో, ప్రభాస్‌తో దీపిక జతకట్టబోతోందనే ప్రచారం ఊపందుకుంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మహేష్ కొత్త చిత్రం టైటిల్ అదే... మరో హిట్ ఖాయమంటున్న ఫ్యాన్స్