Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ఆభరణాలు ధగధగలాడుతూనే ఉండాలంటే?

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (22:10 IST)
ప్రతిరోజు వాడే ఆభరణాలు కానీ, బీరువాలో ఉండే వెండి, డైమండ్, ముత్యాలు, పగడాలు, బంగారం ఆభరణాలు కానీ మెరుపు తగ్గుతాయి. మధ్యమధ్యలో వాటిని శుభ్రపరచడం వల్ల ధగధగలాడుతూ కొత్త వాటిలా మెరుస్తూ ఉంటుంది. 
 
బంగారు ఆభరణాలను వేసుకుని తీసివేసిన తరువాత మెత్తటి కాటన్ క్లాత్‌లో కొంచెం పొడి పసుపు వేసి బాగా తుడిచి బీరువాలో పెట్టాలి. నీటిలో పటిక, చింతపండు రసం, కుంకుడుకాయ రసం కలిపి బంగారు వస్తువులను కడిగితే బాగా మెరుస్తాయి. నీళ్ళలో పసుపు, కొంచెం డిటర్జంట్ పౌడర్ వేసి మరిగించి ఆభరణాలను దాంట్లో వేసి ఒక గంట ఉంచి టూత్ బ్రష్‌తో రుద్దాలి. ఆ తరువాత చల్లటి మంచి నీటిలో కడిగితే ఆభరణాలు కొత్తవాటిలా తళతళలాడుతూ ఉంటాయి.
 
కుంకుడు రసంలో కొంచెం వెనిగర్ కలిపి బంగారువస్తువులను వేసి ఒక గంటసేపు ఉంచి ఆ తరువాత పాత టూత్ బ్రష్‌తో రుద్దితే ధగధగ మెరుస్తాయి. బంగారు నగలు అన్నింటినీ ఒకే బాక్స్‌లో వేస్తే అవి తీసేటప్పుడు చిక్కుపడతాయి. అటువంటప్పుడు వాటిపై కొంచెం టాల్కం పౌడర్ వేస్తే చిక్కుముడులు త్వరగా విడిపడతాయి.
 
అలాగే ముత్యాలు, పగడాలు మొదలైన పూసల నగలు వాడిన తరువాత వాటిపై కొంచెం బియ్యపు పిండి వేసి రుద్దాలి. ఆ తరువాత నీళ్ళలో శుభ్రంగా కడిగితే మెరుస్తూ ఉంటాయి. ఆర్టిఫీషియల్ ముత్యాల ఆభరణాలను కాటన్, ఊలు క్లాత్‌లో వేసి భద్రపరిస్తే మెరుపు పోకుండా ఉంటాయి.
 
వజ్రాల ఆభరణాలను కొంచెం టూత్ పేస్ట్ వేసి బ్రష్‌తో రుద్దితే బాగా మెరుస్తాయి. ఒక లీటర్ నీటిలో టీ స్పూన్ ఉప్పు, సోడా వేసి దాంట్లో వెండి ఆభరణాలను వేసి అయిదునిమిషాలు మరిగించాలి. ఆ తరువాత సబ్బు నీటిలో వేసి బ్రష్‌తో రుద్ది కడిగి మెత్తటి బట్టతో తుడిస్తే కొత్త వాటిలా మెరుస్తాయి. 

సంబంధిత వార్తలు

సీఎం రేవంత్ సర్కారుపై కేటీఆర్ సంచలన ఆరోపణలు : 50 రోజుల్లో రూ.1100 కోట్లు స్కామ్

పాయల్ కపాడియా: 30 ఏళ్ల తర్వాత భారత్‌ తరఫున కేన్స్‌లో చరిత్ర సృష్టించిన ఈమె ఎవరు?

వాయిస్ చేంజింగ్ యాప్‌ ఉపయోగించి యువతులపై అత్యాచారం ... ఎక్కడ?

ప్లీజ్... మా దేశాన్ని ఆదుకోండి.. ప్రపంచ దేశాలకు మాల్దీవులు ప్రెసిడెంట్ విన్నపం!!

థర్డ్ ఏసీనా? జనరల్ బోగీనా? రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణికుల రద్దీ!!

మాస్ ప్రేక్షకులను మెప్పించే చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" : ప్రముఖ నటి అంజలి

రేవ్ పార్టీలో లేకపోవడం మీడియాకు కంటెంట్ లేదు.. రేయి పగలు జరిగే ప్రశ్న : నటుడు నవదీప్

అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. ఈసీ సీరియస్

నా ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేష్ ‘బేబి’ తీశాడు : దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్

ఆ టైప్ కాస్ట్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎనర్జీకి హ్యాట్సాఫ్ : నటసింహం బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments