Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిల్లలు సరిగ్గా తినడం లేదా? పిల్లలకు తిండిపై ఆసక్తి కలగాలంటే ఏం చేయాలి? (video)

Advertiesment
పిల్లలు సరిగ్గా తినడం లేదా? పిల్లలకు తిండిపై ఆసక్తి కలగాలంటే ఏం చేయాలి? (video)
, మంగళవారం, 19 మే 2020 (20:52 IST)
సాధారణంగా పిల్లలు భరించలేనంతగా అల్లరి చేస్తుంటారు. అదే విధంగా తిండి విషయంలోనూ బాగా మారం చేస్తుంటారు. ఆహారపు అలవాట్లలో సైతం బాగా మార్పులు చూస్తుంటాం. అలాంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తిండి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది లేకుంటే పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే క్రింద పేర్కొన్న ఈ చిట్కాలను పాటిస్తే పిల్లలకు తిండిపై ఆసక్తి కలుగుతుంది.
 
* ఎప్పుడూ కూడా పిల్లల ముందు బరువు గురించి మాట్లాడొద్దు.
* మంచి ఆహారాన్ని ఎంపిక చేసుకునే అవకాశం పిల్లలకే ఇవ్వాలి.
* పిల్లలకు పండ్లను అందుబాటులో ఉంచాలి.
* జంక్ ఫుడ్, కూల్‌డ్రింక్స్ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియజేయాలి.
* ఆహార పదార్థాల్లో ఏది మంచో, ఏది చెడ్డదో వివరించాలి.
* వంటగదిలో పోషకాలను అందించే స్నాక్స్ తినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంచండి.
* ఆరోగ్యానికి హానిచేసే పదార్థాలను మార్కెట్‌లో కొనుగోలు చేయకపోవడమే మంచిది.
* పిల్లలతో కలిసి భోజనం చేయాలి.
* పాప్ కార్న్, తృణధాన్యాలు, బ్రెడ్ అండ్ బట్టర్‌ను అందుబాటులో ఉంచాలి.
* వంట గురించి చర్చించేటప్పుడు పిల్లలతో మాట్లాడాలి.
* తినేటప్పుడు ఏ పదార్థం ఎలాంటి మేలు చేస్తుందో వివరించాలి.
* ఓపికగా మంచి భోజనం ఎంచుకునే అలవాట్లను నేర్పించాలి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎర్రబియ్యం తింటే బానపొట్ట తగ్గిపోతుందట..!