Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేసవిలో చెమట మటుమాయం కావాలంటే..?

Advertiesment
Summer health tips
, శనివారం, 16 మే 2020 (15:23 IST)
వేసవిలో వచ్చే శారీరక సమస్యల్లో ముఖ్యమైనది చమట. ఇది అన్ని వయస్సుల వారికి ఉండే ఇబ్బంది. శరీరం మీద చెమట అలాగే నిలిచిపోయినప్పుడు దుర్వాసన రావడం, చెమట పొక్కులు రావడం చర్మం జిడ్డుగా తయారవడం సాధారణం. మరికొన్ని ప్రాంతాల్లో చెమట ఎండిపోయి శరీరం మీద బట్టల మీద తెల్లటి చారలు ఏర్పడతాయి. కొన్ని పద్ధుతులను పాటించడం ద్వారా వీటిని నివారించడానికి ప్రయత్నించవచ్చునంటున్నారు నిపుణులు.
 
ఎక్కువగా చెమట పట్టేవారికి శరీరంలో ఉండే లవణాలు అధికంగా బయటకు వస్తాయి. అందుకని వారు మంచినీటిలో ఉప్పు, పంచదార మొదలైన లవణాలను కలుపుకుని తాగితే తగినంత శక్తి వస్తుంది. ఒక స్పూన్ తేనెలో కాస్త మిరియాలపొడి కలుపుకుని తింటే చెమట కాయల నుంచి తప్పించుకోవచ్చు.
 
ఈ కాలంలో స్నానానికి వాడే సబ్బులు ఎక్కువ సువాసన వచ్చేవి కన్నా మురికిని పొగెట్టేవిగా ఉండాలట. అలాగని ఎక్కువ రసాయనాలు ఉండే సబ్బులు అస్సలు వాడకూడదు. వీపు భాగంలో చెమట అధికంగా పట్టి పేలిపోయే అవకాశం ఉంది. అందుకని ప్రత్యేకమైన బ్రష్‌‌తో వీపును శుభ్రపరుచుకొని పౌడర్ రాసుకోవాలి.
 
పాదాలు, వ్రేళ్ళ మధ్యలో చేరిన మట్టిని పొగొట్టడానికి ప్యూమిక్ స్టోన్ వాడాలి. స్నానం చేసే నీటిలో ముందుగా గులాబీ రేకులు, మల్లెలు వేసి ఆ తరువాత స్నానం చేస్తే శరీరం సువాసన భరితంగా మారుతుంది. గోరువెచ్చటి నీటిలో రసం పిండేసిన నిమ్మకాయ చెక్కలు, ఆకులు, వేప ఆకులు వేసుకుంటే చర్మం జిడ్డు కారడం తగ్గుతుంది. చెమట పట్టడం, వాసన రావడం పూర్తిగా తగ్గుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోగనిరోధక శక్తి పెంచడానికి, అధికంగా సి.విటమిన్ లభించాలంటే?