Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గాయత్రీ మంత్రాన్ని రోజూ పఠిస్తే.. ఎంత మేలో తెలుసా? (video)

గాయత్రీ మంత్రాన్ని రోజూ పఠిస్తే.. ఎంత మేలో తెలుసా? (video)
, గురువారం, 14 మే 2020 (13:57 IST)
Gayathri Mantra
గాయత్రీ మంత్రాన్ని శుక్రవారం పూట జపించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు. 24 అక్షరాలతో కూడిన గాయత్రీ మంత్రాన్ని రోజూ లేదా శుక్రవారం పూట జపించడం ద్వారా పూర్వ జన్మ పాపాలు తొలగిపోతాయి. ఇంకా కొత్త ఉత్సాహం సంతరించుకుంటుంది. వైరాగ్యం పెరుగుతుంది. గాయత్రీ అనే పదానికి అర్థం.. తనను జపించేవారిని కాపాడటం అనేదే. ఈ మంత్రాన్ని ఉచ్ఛరించడం ద్వారా ఆపదలన్నీ తొలగిపోతాయి. 
 
గాయత్రీ మాత అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ జన్మలోనే కాకుండా పూర్వ జన్మల పాపాలను తొలగిస్తుంది. గాయత్రీ అనే మాతకు సావిత్రి, సరస్వతీ అనే పేర్లు కూడా వున్నాయి. అలాంటి ఈ మంత్రం ఉదయం పూట.. గాయత్రీగానూ, మధ్యాహ్నం పూట సావిత్రిగానూ, సాయం సంధ్యావందనంలో సరస్వతిగానూ పఠించడం జరుగుతోంది. గాయత్రీ మంత్రాన్ని జపించిన తర్వాత ఇతర మంత్రాలను జపించడం ఆనవాయితీ. 
 
గాయత్రీ లేని జపం, ఆరాధన, హోమం ఎలాంటి ఫలితాలను ఇవ్వదు. సప్త చిరంజీవులు, 27 నక్షత్రాలు, మహాలక్ష్మీ దేవి అనుగ్రహం కోసం తపించేవారు ఈ మంత్రాన్ని జపించాల్సిందే. అప్పుల బాధలు తొలగిపోవాలంటే.. సకల కార్యాల సిద్ధించాలంటే... సకల దోషాలు తొలగిపోవాలంటే.. వాస్తు దోషాల నుంచి విముక్తి లభించాలంటే.. గాయత్రీ మంత్రాన్ని స్తుతించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
 
గాయత్రి మంత్రం అందరికీ మంచిది. అయితే.. చిన్న పిల్లలకు అయితే మరింత ప్రయోజనకరం. రోజూ గాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల పిల్లల్లో తెలివి పెరుగుతుంది. వాళ్లు అనుకున్నది సాధించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు.. సంధ్యాసమయం, సూర్యోదయానికి ముందు, సూర్యుడు అస్తమించే వరకు ఈ మంత్రం జపించవచ్చు.
 
ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో, మనుసు నిర్మలంగా చేసుకుని.. నిశ్శబ్దంగా గాయత్రి మంత్రం జపించాలి. ఈ మంత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గట్టిగా చదవకూడదు. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా వారసులు తెలివితేటలతో వర్ధిల్లుతారు. శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే.. ప్రతి మంగళవారం, ఆదివారం, అమావాస్య రోజు ఎరుపు దుస్తులు ధరించి ఈ మంత్రాన్ని జపించండి. 
 
ఈ మంత్రం జపించేటప్పుడు దుర్గా దేవిని స్మరించాలి. ఇలా చేయడం వల్ల మీకు శత్రుభయం నుంచి విముక్తి కలుగుతుంది. ఈ మంత్ర పఠనం ద్వారా కంటి సమస్యలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత చోటుచేసుకుంటుంది. భక్తిభావం పెంపొందుతుంది. 
 
గాయత్రీ మంత్రం.. 
ఓం భూర్భువస్సువః 
తత్సవితుః వరేణియం 
భర్గో దేవస్య ధీమహి 
ధియో యోనః ప్రచోదయాత్
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

14-05-2020 గురువారం దినఫలాలు - సాయిబాబాను పూజిస్తే...